గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మే 2010, మంగళవారం

మేలిమి బంగారంమన సంస్కృతి 93.

http://haltonhelps.org/Tree%20hunt/Best%20orchard-fruit%20trees%20by%20Jackie%20Osmond%20Patrick.jpg
శ్లోll
ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయ మాతపే.
ఫలాన్యzపి పరార్థాయ వృక్షాస్సత్పురుషాయివ.
గీll
ఎండలోవృక్షమెండుచు నితరులకది
నీడనిచ్చును. ఫలములు నేల వ్రాల్చు.
మంచివారిని పోలుచు మహిని వెలసి
తీయనైనట్టి పండ్లను తినగ నొసగు. 
భావము:-
వృక్షములు తాము ఎండలో ఎండుచూ ఇతరులకు నీడ నొసగుచున్నవి. అంతే గాక సత్పుషుల వలె తమ ఫలములను కూడా ఇతరులకే ఒసగుచున్నవి. ఈ శరీరము కలిగి యున్నందులకు నిస్వార్థముగా పరోపకారము చేయుటయేకదా సత్పురుష లక్షణము.
జైహింద్. Print this post

4 comments:

Rao S Lakkaraju చెప్పారు...

వెతికి వెతికి ఆణిముత్యాలు తీసి మా కందరికీ కను విప్పు చేస్తున్నందుకు ఆ శ్లోకం మీకూ బాగా వర్తిస్తుంది. చింతా వారూ నమోవాకములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమె మనం పెట్టిన గడ్డితిన్న పశువులు మనకి కమ్మని పాలు యిస్తున్నాయి.భూమాతను తవ్విన కొలదీ మనకి మణి మాణిక్యాలను అందిస్తోంది అలాగే ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలన్ని మననుంచి ఏమాశించి ? " ఫలాపేక్ష లేకుండా ఏదైనా మంచిని చేయగలిగితె అంతకంటే ఔన్నత్యం మరెముందని ? చక్కని విషయం చెప్పినందుకు అభినందనలు.

కథా మంజరి చెప్పారు...

మేలైన విషయములను చక్కని వివరణలతో మాకు అందిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు.
పరోపకారమును గూర్చిన అనేక శ్లోకములు కలవు. వీలయినన్నింటిని తగు వ్యాఖ్యలతో ఒకే టపాలో వ్రాసినయెడల చదువరులు ఆనందించ గలరని నా భావన. ఈ పనికి మీరు సమర్ధులు. ఇది నా అభ్యర్ధనగా భావించ గలరు.

Sandeep P చెప్పారు...

చక్కటి అనువాదాలతో అత్యుత్తమమైన నీతి పద్యాలను మాకందిస్తున్నారండి. మీకు మేము ఋణపడి ఉంటాము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.