శ్లోll
ముహూర్తమపి తం ప్రాజ్ఞః పండితం పర్యుపాస్యహి.
క్షిప్రం ధర్మ విజానాతి జిహ్వా సూప రసానివ.
తే.గీll
పండితులఁ జేరి క్షణమున ప్రాజ్ఞుఁడరయు
ధర్మ సూక్ష్మమ్మునిక్కము ధరణి పైన.
పులుసు రుచినొక్క క్షణములో తెలియు జిహ్వ.
రసనమును పోలి ప్రాజ్ఞులు వసుధ నలరు.
భావము:-
ప్రాజ్ఞుఁడైనవాఁడు ఒక్కక్షణమే యైనను పండితుల సహవాసము చేసి;ధర్మమును తెలుసుకో గలుగు తున్నాఁడు. పులుసు రుచిని నాలుక ఎంతలో తెలుసుకొంటుంది.?
జైహింద్.
Print this post
శాంభవీ శతకము మధ్యాక్కఱ గర్భ ఉత్పల- చంపకములు. ... రచన చింతా రామకృష్ణారావు.
... రచించిన తేదీ. 20 - 4 - 2025.
-
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమః
*శాంభవీ శతకము *
మధ్యాక్కఱ గర్భ ఉత్పల- చంపకములు.
ప్రతీ పాదమునందలి ఆఖరి మూడు క్షరముల...
3 గంటల క్రితం
1 comments:
నిజమె అంత సులభం గా ధర్మాన్ని గురించి తెలుసు కొగల ప్రాజ్ఞులు ముఖ్యం గా ఈ రోజుల్లో ఉన్నారా ? తెలిసినా ఆచరించ గల వారెందరు ? ఐన తెలుసు కొ గలిగితె అంతకంటె అదృష్టం మరేముంది ? మంచి విషయాన్ని చెప్పావు తమ్ముడు ! అభినందనలు
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.