ప్రియ పాఠకులారా!
సత్య వాక్ పరిపాలన విషయంలో మనం చాలా విన్నాం. అసత్య దూరులుగా ఉంటున్నాం. ఐతే ఆ సత్యవాక్ పరిపాలనమే ఒక్కొక్కసారి అప్రయోజనమే కాక ప్రమాదము కూడా కలిగించవచ్చును. ఈ విషయంలో ఒక కవి ఈ క్రింది శ్లోకంలో ఎంత చక్కని ఉపమానంతో వివరించి చెప్పాడో చూద్దామా?
శ్లోll
శూన్యతా పుణ్య కామేన వక్తవ్యానైవ సర్వదా
ఔషధం యుక్తమస్థానే గరళం నను జాయతే.
గీll
సత్యమైనను వ్యర్థమస్థానమైన
పలుక రాదది దుష్టమౌ ఫలిత మిడును.
ఔషధం బది యగుత యస్థానమునను
విషఫలంబిడు నరయుచు మసల వలయు.
భావము:-
మంచి ఔషధమే కాని; అస్థానమందు ఉపయోగించినచో అదే విషమైపోతుంది కదా! అదే విధముగ ఒక విషయము సత్యమే కావచ్చు. కాని అది నిరుపయోగమైనదీ; అస్థానీయమైనదీ కావచ్చు. కావున పుణ్య కామి యగువాడు సత్యమైనా శూన్య వచనము పలుకరాదు.
కావున విజ్ఞతతో మెలగుదాం.
జైహింద్.
Print this post
అనంత భాస్కర శతకముపై నా సమీక్ష. శతక కర్త... శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ
-
* అభినందన మందారం*
*ఓం శ్రీమాత్రే నమః.*
*'శ్రీ అనంత భాస్కర శతక' కర్త శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ గారు *
*వ్బాగ్విదాంవర బిరుదాంచితులు. ఇంతకు ముందు వీ...
1 రోజు క్రితం
1 comments:
నమస్కారములు రామకృష్ణా రావుగారు తమ శ్లొకం లొ చక్కగా చెప్పారు. నిజమె నిజాన్ని నిజంగా నె మాట్లాడినా అది తగని చోటు ఐనచొ విషం గా పరిగణిస్తుంది. మంచి విషయాలు చెప్పారు ధన్య వాదములు.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.