మీ "శ్రీ విరోధికి స్వాగతం పలికిన మీలో ఒక కవి కవిత..." పోస్ట్‌పై vookadampudu క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి నా నమస్కారములు తెలుపగలరు. వారిని గూర్చి గరికపాటి వారు తరతరాల తెలుగు పద్యం లో మెచ్చుకోలుగా చెప్పినారు..
... చలకాలం మీద వారి పద్యం కూడా చెప్పినారు..
కడుపులో ఉన్న బిడ్డ తప్ప అందరూ వణుకు తున్నారని.. ..
ఒక్క మంటనుతప్పితే మిగతా అన్నిమంటలనూ మెచ్చుకుంటున్నారని...
అపుడు మొదట తెలిసినది, ఇపుడు మరలా పచ్చ సంతకం చూస్తున్నాను
అని మన వూకదంపుడు మిత్రులు వ్రాశారు.
దానిని పురస్కరించుకొని, ఆ సందర్భాన్ని వివరిస్తున్నాను.
ఆ:-
గరికిపాటి మెచ్చె కవివతంసునికృతుల్.
మువ్వ గ్రంథమందు బులుసు రచన
మహిమ తెలియఁజేసి మహనీయకవియనె.
చలిని గూర్చి చదివె బులుసు రచన.
చలిని గూర్చి బులుసు వేంకటేశ్వర్లు ఈవిధంగా అన్నారని గరికిపాటివారు తరతరాల తెలుగు పద్యంలో చెప్పుతూ బులుసువారు ప్రాసంగికంగా వారితో చెప్పిన పద్యాన్ని చదివారు.
ఆపద్యం చూడండి.
ఆ:-
చలికి వణుకుచుండె సర్వ మానవ జాతి,
తల్లి కడుపు లోని పిల్ల తప్ప.
మంటలెల్ల వారి మన్ననల్ గొనుచుండె.
మసన మందు వెలుగు మంట తప్ప.{ మసనము = స్మశానము }
చూచార ఎంత సునాయాసంగా భావ పరి పుష్టితో ఒప్పిదమౌనట్లు చెప్పారో!
బులుసు వారి గడుసతనం రచనలో ఎలా ప్రస్ఫుటమౌతుందో సందర్భం వచ్చినప్పుడు తెలుసుకొందాము.
జైహింద్.
Print this post
శ్రీ లలితోపాఖ్యానము.
-
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని
వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అ...
3 రోజుల క్రితం
3 comments:
చావుపుట్టుకలని కూడా ఈ ఒక్క పద్యంలోనే భలే చూపించారండీ.
క:-
ధన్యుడు! సద్గుణ గణ్యుడు
మాన్యుడు సత్కవులలోన. మహనీయుడు. సా
మాన్యుడు కాడయ్య బులుసు.
మాన్యుడ! శ్రీ రాఘవ కవి! మహితాత్ముండా!
hi, nice your blog
welcome
plz visit my blog
gsystime.blogspot.com
spiritual and universal knowledge
thanks,
nagaraju
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.