ఆంధ్రామృత పానోన్ముఖులారా! సాహితీ బంధువులారా!
నిరంతర సాహితీ చర్చ మాత్రమే మన సాహితీ జ్ఞానానికి పదును పెట్ట గలదు. మనం సాహితీ పరంగా ఆలోచనలు, పరిశోధనలు సాగించ గలిగిననాడే మన విజ్ఞానం పక్వత పొందుతుంది. నిశ్శబ్దంలో మనం మిగిలిపోరాదు. అందుకే నిరంతరం సాధన చేద్దాం.
ప్రస్తుతం మనం ఆట వెలది, తేటగీతి, కందము, ఛందములను మాత్రమే వ్రాయడంలో సాధన చేస్తున్నాం. ఇంక మనం వృత్త పద్యాలు కూడా వ్రాసే ప్రయత్నం చేసి సఫలీకృతులమవదామా?
ఐతే ముందుగా ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర గణాలను తెలుసుకొందాం.
ముందుగా
ఏకాక్షరగణములు:-{ ఒకే అక్షరముల గణములు. }
ఒక గురువు గ.:- U
ఒక లఘువు ల :- I
ద్వ్యక్షత గణములు:- { రెండక్షరముల గణములు. }
రెండు గురువులు గగ :- UU
రెండు లఘువులు లల లేదా లా.:- I I
ఒక గురువు ఒక లఘువు గల లేదా హ.:- UI
ఒక లఘువు ఒక గురువు లగ లేదా వ.:-IU
త్ర్యక్షర గణములు:- { మూడక్షతముల గణములు }
మూడు గురువులు మ గణము :- UUU
మొదటి గురువు భ గణము:- UI I
మధ్య గురువు జ గణము:- IUI
చివరి గురువు స గణము:- I IU
మూడు లఘువులు న గణము:- I I I
మొదటి లఘువు య గణము:- IUU
మధ్య లఘువు ర గణము:- UIU
అంత్య లఘువు త గణము:- UUI
ఈ గణములు మనకు వచ్చినట్లయితే మనకు వృత్త పద్యములు వ్రాయడం సులభతరమౌతుంది కదా? కావున మనం వీటిని మూందుగా గుర్తుపెట్టకుందామా?
వృత్త ఛందమునకు సంబంధించిన మరొక అంశం తరువాత తెలుసుకొందాం.
జైహంద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
4 comments:
మీరు చెప్పిన దానికి కొంచెం వివరణ జోడించాలనుకుంటున్నాను.
తప్పులుంటే సరిదిద్దగలరు.
అసలు వృత్తాలకు ఆ పేరు ఎందుకొచ్చిందంటే
మిగిలిన జాతులు, ఉపజాతుల పద్యాల్లో పద్యంలోని కేవలం ఒక్కొక్క పంక్తి లేదా రెండు పంక్తులకు ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి.అందువల్ల పద్యం లోని ఒక పంక్తిని బట్టి అది ఏ పద్యమో చెప్పటం కొంచెం కష్టమే. కానీ
వృత్తాలలో అలా కాకుండా అన్ని పాదాలకు ఒకే నియమాలు, లక్షణాలు ఉంటాయి. ఒక పంక్తికి ఏ నియమమైతే వర్తిస్తుందో అదేనియమం అన్ని పంక్తులకూ చెల్లుతుండటం వల్ల వాటిని వృత్తాలు అన్నారు.
అంతే కాకుండా వృత్త పద్యం లోని మొదటి గణాన్ని బట్టి సాధారణం గా ఆపద్యాన్ని ఏ ఛందస్సుకు చెందినదో చెప్పుయ్యొచ్చు.
ఉదాహరణకు:
మొదటి గణం ’భ ’ గణం అయితే
ఉత్పలమాల
’న’ అయితే
చంపక మాల
’మ’ అయితే
శార్దూలం
’స’ అయితే
మత్తేభం
ఇలా.... ఇంత సౌలభ్యం
ఇతర చందస్సుల్లో కష్టమేమో అనిపిస్తుంది.
తప్పులుంటే నిర్మొహమాటంగా సరిదిద్దగలరు.
ధన్యవాదాలు.
గణ విభజనలోని ప్రాథమిక అంశాలతో చందో పరిచయం బాగుంది.
చ:-
తెలుగు కళన్ రచించు తమ తేనెల మాటలు చూచినాడ. నే
తొలుతనె చెప్ప నొప్పదని, తొందర యేలని, చెప్పలేదు. మీ
రలుక వహింపఁ బోకుడయ. యన్నియు చెప్పుదు, నేర్చు వారికిన్
సులభముకాగ, నెమ్మదిని. సూక్ష్మ వివేక విశారదాగ్రణీ!
ఆచార్యవర్యా: మీ పాఠాలను ఈ మధ్య వినడం కుదరలేదు. మీరు ఈ టపాలో వివిరించిన విషయాలు, పద్యాలని కంప్యూటరీకరించడనికి ఎంతో ఉపయోగపడ్డాయి.
ఈ విషయంలో మీ సహాయం కావాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.