గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2008, ఆదివారం

కందం మనకందం. వ్రాద్దామామరి?

క :-ఆంతా బాగున్నారా?
సంతోషము నొన్దినార? సజ్జనులగు మీ
యంతట మీరే పద్యము
కొంతైనా వ్రాసినారొ గురుతుగ నుండున్.
ఆంధ్రులారా! ఛందస్సు లోనే మనమెందుకు వ్రాయాలనుకొంటున్నారా?చెపుతాను, వినండి.
ఛందస్సు ఒక ఫ్రేమ్ లాంటిది. మన భావాన్ని ఛందో బద్ధమైన అక్షర రూపంలో బిగించి మారడానికి వీలు లేకుండా చేస్తుంది. గణములు, యతులు, ప్రాసలు ఇందుకు తోడ్పడతాయి.
ఇక మీకు కందంలో పద్యం వ్రాయాలనుకున్నారనుకోండి. సులభ శైలిలో కందపద్యాలు వ్రాయబడిన కృష్ణ శతకం లాంటివి మనం మననం చేస్తే , ఒక పాతికపద్యాలు కంఠస్తం వచ్చేసరికి 26 వ పద్యం మీకు తన్నుకొస్తుంది. వ్రాయాలనిపిస్తుంది .
ఇంక గణాలంటారా అవి కాలానుగుణంగా నేర్చుకోవచ్చు. మేరూ ప్రయత్నించి మీ అనుభవాన్ని నాకూ పంచండి. Print this post

1 comments:

దైవానిక చెప్పారు...

http://joruga-husharuga.blogspot.com/2008/08/blog-post_31.html లో కొన్ని కందాలు చూడండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.