జైశ్రీరామ్.
ఉత్తరాధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు, ప్రజల దాహార్తిని తీర్చేటందుకు, పరిశ్రమలావసరాలను తీర్చేటందుకు పోలారం ఎడమకాల్వనుండి జలాలను రప్పించిన విడుదల చేసిన అపర భగీరథుఁడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాచంద్రబాబునాయుఁడు గారు. వీరి ఋణం ఆంధ్రప్రదేశ్ తీర్చుకోలేనిది అనుటలో ఏమాత్రం సందేహం లేదు.
నాకు బాగా గుర్తు. మా చిన్నప్పుడు ఒక సభలో మాకు పోలవరం ప్రోజెక్ట్ కావాలి అని ప్రజలడిగితే నాటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్।డిగారు చూడు నాయనా ఆ ప్రక్కనేముంది? అని అడిగారు ఒకవైపు చూపిస్తూ, ఆ వ్యక్తి ఒక పెద్ద ఎత్తైన కొం।డ ఉందం।డి అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగారన్నారు చూచావుగా ఆ కొండ ఎంత ఎత్తుంద్।ఓ? ఆంతఎత్తు ధనం మనకు కావాలి ఆ ప్రోజెక్టు కోసం. మన రాష్ట్రం పేదది ఎలా సాధ్యమౌతుందో చెప్పు? అన్నారు. మొక్కవోని పట్టుదలౌంటే ఇది సాధ్యమే అని మన ముఖ్యమంత్రివర్యులు రుజువు చేశారు.
ఇంతటి అద్భుత అసాధారణకార్యక్రమ నిర్వహణాదక్షులగు ముఖ్యమంత్రివర్యులకు శిరసువంచి పాదాభివందనం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎలా ఉండఁగలదు?
ముఖ్యమంత్రివర్యులు నిండుగా నూట యిరవై సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి రాష్ట్రప్రజలకు ఆశాదీపంగా జీవితాలలో కాంతిరేఖలు నింపుతూ ఉండాలని మనసారా కోరుకొందాము.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.