గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, డిసెంబర్ 2024, మంగళవారం

'ధ్రువంతే రాజావరుణో. (ఋగ్వేద /10వమండలం/173వ సూక్తము/5వ మంత్రము.) ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

మం.  'ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి:

ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్".

(ఋగ్వేద /10వమండలం/173వ సూక్తము/5వ మంత్రము.)

తే.గీ.  వరుణ రాజు స్థిరంబుగా వరలుగాక,

వర బృహస్పతి స్థిరుఁడయి ప్రబలు గాక,

యింద్రుఁడును నగ్ని స్థిరమున నెనయుచుండి,

రాజ్యమును నిల్పి స్థిరముగ రక్షనిడుత.

భావము.  వరుణ రాజు స్థిరుఁడు అగును గాక. బృహస్పతి దేవత స్థిరుఁడు అగునుగాక. 

ఇంద్రాగ్నులు స్థిరులై రాజ్యమును స్థిరముగ పోషింతురుగాక. ప్రభుత్వము 

పంచభూతము లంతటి స్థిరము కావలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.