గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, నవంబర్ 2023, మంగళవారం

నా గురించి ... అని శీర్షికతో భక్తిసాధనం వేదిక నిర్వాహకులు వ్రాయమనగా నేను వ్రాసిన సీసము.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

శ్రీమన్మంగళ భక్తి సాధనం సమూహ సభ్యులకు ప్రణామములు.

అంశము ... నాగురించి ....


సీ.  నా యన్నదెవరని నన్ను నేనడుగ, తా నా తండ్రి నడుగంగ నన్నుఁ బంపె,

సన్యాసి రామాఖ్య సదయులౌ నాతండ్రి, నా తల్లి రత్నమ్ము నన్నుఁ జూచి

పాంచ భౌతిక దేహ బద్ధుఁడై పరమాత్మ నీ దేహమందున నిలిచియుండ,

తానె నీవైతివి, తాదాత్మ్యతంజెంది నిన్ను నీ వెఁఱుఁగుము నియతి ననిరి, 

తే.గీ.  అప్పు డేన్ గాంచి తాత్మలో ననుపమముగ

నున్న నా తల్లిదండ్రులే  యుమయు శివుఁడు

నాదు ప్రాణమై నాలోన మోదమలర

యున్నవిషయంబు నా యన్న దున్నదదియె.


ఆత్మస్వరూపులయిన ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లుచు

చింతా రామకృష్ణారావు.🙏🏼

జైహింద్.,

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.