జైశ్రీరామ్.
శ్లో. కవిః కరోతి కావ్యాని .. రసం జానాతి పణ్ణితః|
తరుః సృజతి పుష్పాణి .. మరుద్వహతి సౌరభమ్.
తే.గీ. కవులు చేయగ సత్కావ్య కల్పనలను
కావ్యసారమున్ బండితుల్ గాంతురెన్ని,
వృక్షములు చక్కనైనట్టి విరులు పూయ
పరిమళము వ్యాప్తిచేయును వాయువిలను.
భావము.
కవి కావ్యాలను వ్రాయును. పండితుడు అందలి సారమును తెలుసుకొనును.
చెట్టు పుష్పములను పుష్పించును- వాయువు వాటి సుగంధమును వ్యాపింపజేయును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.