జైశ్రీరామ్.
శ్లో. రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోऽశుచిః|
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. || 18-27 ||
తే.గీ. రాగి, లోభి, ఫలాపేక్ష గ్రాలువాడు,
హింసచేసెడివాడు, మహినశుచియు,
దుఃఖసుఖములకుకలగు దుస్స్వభావి,
రాజసికుడని యెరుగుము, రాజపుత్ర.
భావము.
రాగంతో కూడి ఫలం కోరుతూ, పిసినిగొట్టు తనమూ, హింసా స్వభావం కలిగి, అశుచి అయి,
సుఖదుఃఖాలకు లోనయ్యే కర్త --రాజసికుడని చెప్ప బడుతుంది.
శ్లో. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోऽలసః|
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. || 18-28 ||
తే.గీ. నిగ్రహము లేని, పామరుని, మొరటును, వి
షాదపూర్ణు, సంకుచితమౌ ఖేదగుణుని,
బద్ధకస్తుని, మొండిని, ప్రబల మోస
గానినిల కాల యాపకున్, గాంచ తామ
సికులుగా జెప్ఫనొప్పును
స్థిరగుణాఢ్య!
భావము.
ఎలాటి నిగ్రహం లేని వాడు, పామరుడు, సంకుచిత స్వభావం కలవాడు, మొండివాడు,
మోసగాడు బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతి దానికి కాలయాపన చేసే కర్త,
తామసికుడని చెప్ప బడతాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.