జైశ్రీరామ్.
శ్లో. అనుబన్ధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్|
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. || 18-25 ||
తే.గీ. క్షయము ననుబంధమున్ హింస, శక్తి గనక
మించి చేయుట మోహమున్ మించి మొదలు
పెట్టుటివి తామసికమగు విజయ! నిజము
నీవు గ్రహియింపుమీ భువి నేర్పు మీర.
భావము.
బంధనంలో ఇరికించేది, నాశనాన్ని హింసను కలుగచేసేది శక్తి సామర్ధ్యాలు
లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినదీ అయిన కర్మ
తామసిక కర్మ అని చెప్ప బడుతుంది.
శ్లో. ముక్తసఙ్గోనహంవాదీ
ధృత్యుత్సాహసమన్వితః|
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే. || 18-26 ||
తే.గీ. సంగముక్తు డహము లేక సదయనొప్పి,
పట్టుదల దీక్ష నొప్పుచు బరగువాడు,
నిరతముత్సహియై, జయ ధరనపజయ
ములకచలచిత్తుడేసాత్వికుడరయుమిది.
(ల-డ.లకుప్రాసయతి)
భావము.
సంగభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేని వాడు, పట్టుదల
ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వలన చలించని వాడు అయిన కర్త
సాత్వికుడని చెప్పబడతాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.