జైశ్రీరామ్.
ఏకాక్షరి అంటే ఒకే హల్లుతో కూర్చిన పద్యం.ఇందులో ఏ అచ్చైనా వాడవచ్చు ఎన్ని అచ్చులైనా వాడవచ్చు
కానీ హల్లుమాత్రం ఒకటే వాడాలి.
విక్రాల శేషాచార్యులవారి
శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
ఈ ఉదాహరణ చూడండి-
నిన్ను నిను నెన్న నీనె
నెన్నిన నన్నన నన్నన నన ననిన నానేనా
ని న్నూనినా ననూనున్
న న్నూనన్నాను నేననా నున్నానా!
దీన్ని ఈ విధంగా పదవిభాగం తీసుకోవాలి-
నిన్నున్ - ఇనున్ - ఎన్నన్ - ఈనేను - ఎన్నినన్-
అన్నన్న - ననను -అనిన - నానేనా - నిన్ను -
ఊనినాను - అనూనున్ - నన్ను - ఊను -
అన్నాను - నేను - అనా - నున్నానా
అర్థం -
నీకు పైన ప్రభువులులేని, సర్వస్వమునకు ప్రభువైనవాడా
సర్వేశ్వరుడవైన నిన్ను స్తుతించుటకొరకు ఈ నేను ఆలోచిస్తే
చిగురువలె అల్పుడను. చోద్యము గొప్పవాడవైన నిన్ను ఆశ్రయించాను
శకటాసురుని సంహరించినవాడా తండ్రీ నన్ను ఆదుకొనుము అంటిని.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.