జైశ్రీరామ్.
చమత్కార పద్యం
చదువుచున్నప్పుడు ఏమిటి ఈ పదాలు.. అనుకుంటాము. ... కానీ ఇది సంకేతార్థాలతో రచింపబడ్డ ఒక ఆశీర్వాద పద్యము! ఇదొక కవి చమత్కారం!
ఆలి నొల్లకయున్న వానమ్మ మగని
నందులోపల నున్న వానక్క మగని
నమ్మినాతని జెరచు దానమ్మ సవతి
సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణతోడ!
ఆలినొల్లక యున్నవాడు భీష్ముడు.
అతని అమ్మ గంగ.
ఆమె మగడు సముద్రుడు.
అందులో ఉన్నవాడు మైనాకుడనే పర్వతము.
అతని అక్క పార్వతి.
ఆమె మగడు శివుడు.
అతణ్ణి నమ్మినవాడు రావణుడు.
వానిని చెరచినదిగా అనగా అంతమొందించినది సీత.
ఆమె అమ్మ భూదేవి.
ఆమెకు సవతి లక్ష్మీదేవి.
ఆమె దయతో మీకు ఎల్లప్పుడూ సంపదలనిచ్చు గాక అని పై పద్యము యొక్క భావము.
జైహింద్.
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.