గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, డిసెంబర్ 2019, ఆదివారం

అష్ట దిగ్గజములు....

అష్ట దిగ్గజములు.
 🐘🐘🐘🐘🐘🐘🐘🐘

శ్లో. ఐరావతః పుండరీకో వామనః కుముదోఽఞ్జనః౹
పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః౹౹

అష్ట దిగ్గజాలు అంటే (అష్ట + దిక్ + గజములు = "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు"). ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని చెబుతారు. ఇవే అష్టదిగ్గజాలు. అలాగే ఈ అష్టదిగ్గజాల భార్యల పేర్లు-దిక్కు- దిక్పాలకుని పేరు వరుసగా ఇవ్వబడినవి.

గజం పేరు- గజ భార్య- దిక్కు-పాలకుడు.*

1. ఐరావతం-అభ్ర-తూర్పు-ఇంద్ర

2. పుండరీకం-కపిల-ఆగ్నేయం-అగ్ని;

3. వామనం-పింగళ-దక్షిణం-యమ;

4. కుముదం-అనుపమ-నైఋతి-నిఋతి;

5. అంజనం-తామ్రపర్ణి-పశ్చిమం-వరుణ;

6. పుష్పదంతం-శుభ్రదంతి-వాయవ్యం-;

7. సార్వభౌమం-అంగన-ఉత్తరం-కుబేర;

8. సుప్రతీకం-అంజనావతి-ఈశాన్య-ఈశాన.

అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు. విజయ నగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులు అష్టదిగ్గజాలుగా తెలుగు సాహితీ సంప్రదాయంలో ప్రసిద్ధులయ్యారు.

1. అల్లసాని పెద్దన
2. నంది తిమ్మన
3. ధూర్జటి
4. మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి
5. అయ్యలరాజు రామభధ్రుడు
6. పింగళి  సూరన
7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
8. తెనాలి రామకృష్ణుడు

🐘🐘🐘🐘🐘🐘🐘🐘
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.