గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2019, గురువారం

పుష్పవిలాపము తెలుగు మూలము : కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సంస్కృతానువాదము : వెంపటి కుటుంబ శాస్త్రి

జైశ్రీరామ్.
పుష్పవిలాపము
తెలుగు మూలము : కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు
సంస్కృతానువాదము : వెంపటి కుటుంబ శాస్త్రి
చేతురారంగ నిన్ను పూజిన్చు కొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను.
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు గొనితేర నరిగితి పుష్పవనికి.
హస్తప్రీతి లతాన్త-సన్తతి-ముఖై స్త్వామర్చితుం చిన్తయన్
ప్రత్యూషే గృహ-కుక్కుట-ధ్వనిమను స్వాపం విహాయైకదా|
గాంగం స్నాన-విధిం విధాయ విహితం ధృత్వా చ ధౌతం శుచిర్-
భూత్వా పుష్పవనీ మయాసిష మహం చేతుం సుమాన్యాదరాత్||
నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి క్రుంగిపోతి నా
మానసమందెదో తళుకు మన్నది “పుష్పవిలాప” కావ్యమై||
స్థిత్వా పుష్పతరో స్సమీప భువి తం భంక్త్వా ప్రతానం ముదా
యావన్మే నఖమాదధామి కలయన్ పుష్పావ చాయం తతః|
తావత్తా  స్సుమబాలికా స్సకరుణం వ్యాదాయ వక్త్రం జగుః
“కిం నః ప్రాణ మపాకరోషి? కిము తేఽస్మాభిః కృతం విప్రియమ్||
కావ్యం “పుష్పవిలాప”నామ హృది మే స్ఫూర్తం చ కించిత్ తదా||
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.