గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2019, సోమవారం

గోదా శబ్దనిర్వచనం సూరన కవి కృతము

జైశ్రీరామ్.
 గోదా శబ్దనిర్వచనం సూరన కవి కృతము

ఉ. ఆదట స్వర్గమిచ్చుట ౧, నఘౌఘమడంచుట ౨,మోక్షమిచ్చుటన్ ౩,
పాదుగ జన్మబంధముల బాపుట ౪ ,దివ్యవచః ప్రకాశక
శ్రీదయ ౫ ,సేయుటల్ ౬, ప్రకృతిజె౦డుట భూమిజనించుటల్ ౭,సువా
జ్మోదమొసంగుటల్౮,నయనము౦గలిగించుట రంగశాయికిన్ ౯,
గాదనకన్ ధరిత్రినిడగా దగుటన్ ౧౦,నిను దేశికోత్తముల్
గోద యటండ్రు సర్వ బుధకోటి నంతింపగ రంగనాయకీ!

వివరణ-
౧.  గో  స్వర్గం ద ఇచ్చునది - గోదా
౨.  గో  మోక్షం ద ఇచ్చునది - గోదా
౩.   గో  పాపం ద  పోగొట్టేది - గోదా
౪.  గో  పశుప్రాయ జన్మం ద ఖండించేది - గోదా
౫.  గో  కవన వాక్ఛక్తిని ద  కలిగించేది - గోదా
౬.  గో  అర్చిరాది మార్గం ద కటాక్షించేది - గోదా
౭.  గో  రంగనాథునికి నేత్రం ఇచ్చునది, అంటే వారి చూపు
        వీరి జన్మస్థలమందే ఉంచడం - గోదా
౮.  గో భూమిని ద  భేదించుకొని వచ్చినది - గోదా
౯.  గో తిరుప్పావై శ్రీసూక్తిని ద కల్పించినది - గోదా
౧౦.గో భూమండలం ద కృపసేయునది - గోదా
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.