గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2019, శనివారం

Amarakosham part 2 అమరకోశం 2వ భాగం अमरकोशः द्वितीयभागः।

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, నవంబర్ 2019, శుక్రవారం

Amarakosa - 1( 1st Varga of Part 1) - Swarga (Heaven)

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, నవంబర్ 2019, గురువారం

పరంతపా,నీరజ,స్తుతి,ప్రతాపనా,సమతమరు,దొరకొను,చొనకు,కనుమా,వెంటరాని,త్రిభంగినీ,గర్భ"-కరమరుదౌ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ

0 comments

జైశ్రీరామ్.
పరంతపా,నీరజ,స్తుతి,ప్రతాపనా,సమతమరు,దొరకొను,చొనకు,కనుమా,వెంటరాని,త్రిభంగినీ,గర్భ"-కరమరుదౌ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ                            

"-కరమరుదౌ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.స.మ.న.జ.జ.స.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతాను గతికా లోకానన్!కరమరుదౌ!నరజన్మ!కనుమా!కీర్తి ఘటింపన్!
గతించు వడి!కాలంబెంచన్!కరటును వీడి చరించు!కన!రారెవ్వరు వెంటన్!
స్తుతింపవలె!మోక్షంబందన్!దొరకొను సామ్యత నొప్పు!తునుమం రాదిల సత్యమ్!                                              
ప్రతాపమున!శ్రీమంతానన్!పరముడు భక్తిని మెచ్చ!వనథివై!జను ధీరా!
1.గర్భగత"-పరంతపా"-వృత్తము.
బృహతీఛందము.జ.స.మ.గణములు.వృ.సం.30,
ప్రాసనియమము కలదు.
గతాను గతికా లోకానన్!
గతించు వడి కాలంబెంచన్!
స్తుతింప వలె!మోక్షంబందన్!
ప్రతాపమున!శ్రీమంతానన్!
2.గర్భగత"-నీరజ"-"-వృత్తము.
బృహతీఛందము.న.జ.జ.గణములు.వృ.సం.368.
ప్రాసనియమము కలదు.
కరమరుదౌ!నర జన్మ!
కరటును వీడి చరించు!
దొరకొను సామ్యత నొప్పు!
పరముడు భక్తిని మెచ్చ!
3.గర్భగత"-స్తుతి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.భ.గగ.గణములు.వృ.సం.52.
ప్రాసనియమము కలదు.
కనుమా!కీర్తి ఘటింపన్!
కన రారెవ్వరు వెంటన్!
తునుమం రాదిల సత్యమ్!
వనథీవై!జను ధీరా!
4.గర్భగత"-ప్రతాపనా"-వృత్తము.
ధృతిఛందము.జ.స.మ.న.జ.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతాను గతికా లోకానన్!కర మరుదౌ!నర జన్మ!
గతించు వడి కాలంబెంచన్!కరటును వీడి చరించు!
స్తుతింప వలె!మోక్షంబందన్!దొరకొను సామ్యత నొప్పు!
ప్రతాపమున!శ్రీమంతానన్!పరముడు భక్తిని మెచ్చ!
5గర్భగత"-సమతమరు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.జ.స.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర మరుదౌ!నర జన్మ!కనుమా!కీర్తి ఘటింపన్!
కరటును వీడి చరించు!కన రారెవ్వరు వెంటన్!
దొరకొను సామ్యత నొప్పు!తునుమంరాదిల సత్యమ్!
పరముడు భక్తిని మెచ్చ!వనథీవై!జను ధీరా!
6.గర్భగత"-దొరకొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.జ.స.భ.త.భ.య.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర మరుదౌ!నరజన్మ!కనుమా!కీర్తి ఘటింపన్!గతాను గతికా!లోకానన్!
కరటును వీడి చరించు!కన!రారెవ్వరు వెంటన్!గతించు వడి!కాలంబెంచన్!
దొరకొను సామ్యత నొప్పు!తునుమం రాదిల సత్యమ్!స్తుతింప వలె!మోక్షం బందన్!                                            
పరముడుభక్తిని మెచ్చ!వనథీవై!జను ధీరా!ప్రతాపమున!శ్రీమంతానన్!
7.గర్భగత"-చొనకు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భత.భ.య.గగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కనుమా!కీర్తి ఘటింపన్!గతాను గతికా లోకానన్!
కన రారెవ్వరు వెంటన్!గతించువడి కాలంబెంచన్!
తునుమం రాదిల సత్యమ్!స్తుతింప వలె మోక్షంబందన్!
వనధీవై జనుథీరా!ప్రతాపమున శ్రీమంతానన్!
8.గర్భగత"-కనుమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.త.భ.య.త.నభ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కనుమా!కీర్తిఘటింపన్!గతాను గతికా లోకానన్!కరమరుదౌ!నరజన్మ!
కన!రారెవ్వరు!వెంటన్!గతించు వడి!కాలంబెంచన్!కరటును వీడి చరించు!
తునుమం రాదిల సత్యమ్!స్తుతింప వలె!మోక్షంబందన్!దొరకొను సామ్యత నొప్పు!                                            
వనథీవై జను థీరా!ప్రతాపమున శ్రీమంతానన్!పరముడు భక్తిని మెచ్చ!
9.గర్భగత"-వెంటరాని"-వృత్తము.
ధృతిఛందము.న.జ.జ.జ.స.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరమరుదౌ!నరజన్మ!గతాను గతికా!లోకానన్!
కరటును వీడి చరించు!గతించు వడి కాలంబెంచన్!
దొరకొను సామ్యత నొప్పు!స్తుతింప వలె!మోక్షంబందన్!
పరముడు భక్తిని మెచ్చ!ప్రతాపమున శ్రీమంతానన్!
10,గర్భగత"-త్రిభంగినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.జ.జ.స.మ.స.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర మరుదౌ!నరజన్మ!గతాను గతికా లోకానన్!కనుమా!కీర్తి ఘటింపన్!
కరటును వీడి చరించు!గతించు వడి!కాలంబెంచన్!కన రారెవ్వరు వెంటన్!
దొరకొను సామ్యత నొప్పు!స్తుతింప వలె!మోక్షంబందన్!తునుమం రాదిల సత్యమ్!                                                                                    
పరముడు భక్తిని మెచ్చ!ప్రతాపమున శ్రీమంతానన్!వనథీవై జను ధీరా!!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
  జైహింద్.

27, నవంబర్ 2019, బుధవారం

శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ విరచిత రథ, చతుతంగ బంధ పద్యములు.

0 comments

జైశ్రీరామ్
శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ విరచిత

1)   గణేష స్తుతి     (రధ బంధ సీసము)
శం , శాంకరి కొమరా! చంద్ర చూడ శుభ తనయ! బొజ్జ దేవర!, నాగ సూత్ర
ధర! వారణంపు వదన! నిత్య మోదక వాంఛితా! పరమేష్టి  భావుక! గణ
నాధా!ఎలుక వాహనా!,కుమారాగ్రజా!  విల సితంపు వదనా!, విఘ్న రాజ!
 సుప్ర దీపుండ! శుభ ప్రదా! జిష్ణుడ! యేకదంతా! సర్వలోక నాధ!,

చదిర వీక్షితా!  భువిజన సమ్మతి విత
రణ! శుభ ప్రదాత!వ్యాస భారత విధాత!
యెపుడు కాంచుచు,తప్పుల నెప్పుడు క్షమ
చూపి దీనుల బాధలు బాపు మయ్య.
                                                          పూసపాటి కృష్ణ సూర్యకుమార్


2 చతురంగ బంధ సీస పార్వతీ ప్రార్ధన

నగజాత! యాదవి! నగనందిని!గిరిజ!
                 అంబిక! అద్రిజ!,యమున! నాగ
హారుని దేవేరి!ఆదిశక్తి! అనంత!
          మలయ నివాసిని!మాత!సౌమ్య!
చేతన సఖి!గట్టుధీత! నగపు సూన!
          శరవణ భవమాత! సర్వలోక
సేవితా!శారదా! శివసత్తి! మాలినీ!
          దక్ష తనూభవ! దాక్షి! సింహ
యాన! శ్రీ నీల లోహిత! అగజ!హిమజ!
అజిత! సాప్తపదీన జాయ!  జితి  సహిత!
వాజస సహధర్మ చరిణీ! భవ్య! శ్రీ గ
జాన నోల్ల!  ఘనంబుగా సంతు గోరి
(సింహ వాహినీ నీ సేవ  చేసినాము)
 స్వస్తి.
శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

26, నవంబర్ 2019, మంగళవారం

సూక్తి,వరీయ,భద్రకా,అనురాగ,భారసీ,మంజుల శోభా,భ్రాంతిరా,ప్రాంజలి,పద్ధతుల,త్రభంగినా,గర్భ"-పతనాభిరామ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్
సూక్తి,వరీయ,భద్రకా,అనురాగ,భారసీ,మంజుల శోభా,భ్రాంతిరా,ప్రాంజలి,పద్ధతుల,త్రభంగినా,గర్భ"-పతనాభిరామ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.                        

పతనాభిరామ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.ర.భ.భ.ర.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పతన మనోభిరామమౌ!పద్ధతి నుద్ధతి యౌనె?ప్రాంజలి నొప్పం సరౌనొకో?
గతమును లెక్క సేయుమా!గద్దియ శాశ్వత మౌనె?కంజదళాక్షుండు మెచ్చునే?
మతి మమతానురాగముల్!మద్దతు పల్కును గాదె?మంజులమౌ!శోభ!నెంచగాన్!
సతతము మేలునౌ నిలన్!చద్దియ మూటగు నెంచ!సం జనితంబౌ! వరాంబుధుల్!          
1.గర్భగత"-సూక్తి"-వృత్తము.
బృహతీఛందము.న.జ.ర.గణములు.వృ.సం.178.
ప్రాసనియమము కలదు.
పతన మనోభి రామమౌ!
గతమును లెక్క సేయుమా!
మతి మమతాను రాగముల్!
సతతము మేలునౌ!నిలన్!
2.గర్భగత"-వరీయ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
పద్ధతి నుద్ధతి యౌనె?
గద్దియ శాశ్వత మౌనె?
మద్దతు బల్కును కాదె?
చద్దియ మూటగు నెంచ!
3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
ప్రాంజలి నొప్పం సరౌనొకో?
కంజదళాక్షుండు మెచ్చునే!
మంజులమౌ!శోభ నెంచగాన్!
సంజనితంబౌ!వరాంబుధుల్!
4.గర్భగత"-అనురాగ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.ర.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు. వృ.సం.
పతన మనోభిరామమౌ!పద్ధతి నుద్ధతి యౌనె?
గతమును లెక్క సేయుమా!గద్దియ శాశ్వతమౌనె?
మతి మమతాను రాగముల్!మద్దతు బల్కును కాదె!
సతతము మేలునౌ!నిలన్!చద్దియ మూటగు నెంచ!
5.గర్భగత"-భారసీ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పద్ధతి నుద్ధతి యౌనె?ప్రాంజలి నొప్పం సరౌనొకో?
గద్దియ శాశ్వత మౌనె?కంజ దళాక్షుండు మెచ్చునే!
మద్దతు పల్కును కాదె?మంజులమౌ!శోభ నెంచగాన్!
చద్దియ మూటగు నెంచ!సంజనితంబౌ!వరాంబుధుల్!
6.గర్భగత"-మంజుల శోభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.ర.జ.న.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పద్ధతి నుద్ధతి యౌనె?ప్రాంజలి నొప్పం సరౌనొకో?పతన మనోభిరామమౌ!గద్దియ శాశ్వతమౌనె?కంజదళాక్షుండుమెచ్చునే!గతమును లెక్కసేయుమా!
మద్దతు పల్కును కాదె?మంజులమౌ!శోభనెంచగాన్!మతి మమతాను రాగముల్!
చద్దియమూటగు నెంచ!సంజనితంబౌ!వరాంబుధుల్!సతతము మేలునౌ!నిలన్!                  
7.గర్భగత"-భ్రాంతిరా"-వృత్తము.
ధృతిఛందము.భ.త.ర.న.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రాంజలి నొప్పం సరౌనొకో!పతన మనోభిరామమౌ!
కంజ దళాక్షుండు మెచ్చునే!గతమును లెక్క సేయుమా!
మంజులమౌ!శోభ నెంచగాన్!మతి మమతాను రాగముల్!
సంజనితంబౌ!వరాంబుధుల్!సతతము మేలునౌ!నిలన్!
8.గర్భగత"-ప్రాంజలి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.న.జ.ర.భ.భ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రాంజలి నొప్పం సరౌనొకో!పతన మనోభిరామమౌ!పద్ధతి నుద్ధతి యౌనె?
కంజ దళాక్షుండు మెచ్చునే!గతమును లెక్కసేయుమా!గద్దియ శాశ్వత మౌనె!
మంజులమౌ!శోభనెంచగాన్!మతి మమతాను రాగముల్!మద్ధతు పల్కును కాదె?                
సంజనితంబౌ!వరాంబుధుల్!సతతము మేలునౌ!నిలన్!చద్దియ మూటగు నెంచ!                                
9.గర్భగత"-పద్ధతుల"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.భ.న.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పద్ధతి నుద్ధతి యౌనె?పతన మనోభిరామమౌ!
గద్దియ శాశ్వత మౌనె!గతమును లెక్క సేయుమా!
మద్దతు పల్కును కాదె?మతి మమతాను రాగముల్!
చద్దియ మూటగు నెంచ!సతతము మేలునౌ నిలన్!
10,గర్భగత"-త్రిభంగినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.భ.న.ర.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పద్ధతి నుద్ధతి యౌనె?పతన మనోభి రామమౌ!ప్రాంజలి నొప్పం సరౌనొకో?
గద్దియ శాశ్వత మౌనె!గతమునులెక్క సేయుమా!కంజ దళాక్షుండు మెచ్చునే!
మద్దతు పల్కును కాదె?మతి మమతానురాగముల్!మంజులమౌ!శోభ నెంచగాన్!                                            
చద్దియ మూటగు నెంచ!సతతము మేలునౌ నిలన్!సం.జనితంబౌ! వరాంబుధుల్!
                                                                             
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

25, నవంబర్ 2019, సోమవారం

I and U...శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.

1 comments

జైశ్రీరామ్.
How can you "SM_LE"
without *"I"* ?
How can you be "F_NE"
without *"I"* ?
How can you "W_SH"
without *"I"* ?
How can you be "N_CE"
without *"I"* ?
How can you be "FR_END"
without *"I"* ?
*"I"* am very important.
But this *"I"* can never achieve "S_CCESS" nor can "LA_GH" without all of *"U"*.
and
that makes *"U"* more important than *"I"*.
 జైహింద్

24, నవంబర్ 2019, ఆదివారం

ప్రజాపత్రిక ఔదార్యం.

1 comments

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
ఆర్యులకు శుభోదయమ్.
ఆ లలితాచంద్రమౌళేశ్వరుని దయాప్రాప్తమయిన శతకరచనను గూర్చి ప్రజాపత్రిక వారపత్రిక వారు ప్రశంసించుచు ప్రకటించి తమ ఔదార్యమును చాటుకొనినారు. వారికి నా ధన్యవాదములు. అంతా ఆ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహఫలమే కాని నాశక్తి ఏమాత్రమూ కాదని ఇందుమూలముగా విన్నవించుకొనుచున్నాను.
నమస్తే.,
జైహింద్.

పఠిమా,పరిహరణా,నతయా,వినిర్మలా,భారజాశ్రీ,దొర్లాడు,నతయతా,నతోత్తేజ,వక్రయా,చిత్తోన్మాద,గర్భ"-చెడుచేతనా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
పఠిమా,పరిహరణా,నతయా,వినిర్మలా,భారజాశ్రీ,దొర్లాడు,నతయతా,నతోత్తేజ,వక్రయా,చిత్తోన్మాద,గర్భ"-చెడుచేతనా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                          
"-చెడుచేతనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.స.భ.ర.జ.స.ర.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుశ్చేష్టిత చేతన క్రియల్!దుర్మదచిత్తమొప్పుచున్!దొరతనంబంచు!చరించన్!
నిశ్చేష్టితమేర్చుజనులన్!నిర్మలతంజెరంచుచున్!నిరుపమంబౌ!నటులెంచన్!
దుశ్చర్యలముంచదగునే?తర్మెద వేల నీతినిన్!దురహమున్మోహన భ్రాంతిన్!
దుశ్చాతురి!ముక్తిగనునే?దుర్మతి వీడుమానవా!దొరలి పోవును సిరు లెల్లన్?
1.గర్భగత"-పఠిమా"-వృత్తము.
బృహతీఛందము.త.జ.స.గణములు.వృ.సం.237.
ప్రాసనియమము కలదు.
దుశ్చేష్టిత చేతన క్రియల్?
నిశ్చేష్టిత మేర్చు జనులన్!
దుశ్చర్యల ముంచ దగునే!
దుశ్చాతురి ముక్తి గనునే?
2.గర్భగత"-పరిహరణా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.ర.లగ.గణములు.వృ.సం.87,
ప్రాసనియమము కలదు.
దుర్మద చిత్త మొప్పుచున్!
నిర్మలతం జెరంచుచున్!
తుర్మెద వేల?నీతినిన్!
దుర్మతి వీడు మానవా!
3.గర్భగత"-నతయా"-వృత్తము.
బృహతీఛందము.న.త.య.గణములు.వృ.సం.104.
ప్రాసనియమము కలదు.
దొరతనంబంచు చరించన్!
నిరుపమం బౌనటు లెంచన్!
దురహమున్మోహన భ్రాంతిన్!
దొరలి పోవుం! సిరు లెల్లన్!
4.గర్భగత"-వినిర్మలా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.స.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుశ్చేష్టిత చేతన క్రియల్!దుర్మద చిత్త మొప్పుచున్!
నిశ్చేష్టిత మేర్చు జనులన్!నిర్మలతం జెరంచుచున్!
దుశ్చర్యల ముంచ దగునే?తుర్మెద వేల?నీతినిన్!
దుశ్చాతురి ముక్తి గనునే?దుర్మతి వీడు మానవా!
5.గర్భగత"-భారజాశ్రీ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.స.భ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము!
ప్రాస నియమము కలదు.వృ.సం.
దుర్మద చిత్తమొప్పుచున్!దొరతనంబంచు చరించన్!
నిర్మలతం జెరచుచున్!నిరుపమంబౌనటు లెంచన్?
తర్మెదవేల?నీతినిన్!దురహమున్మోహన భ్రాంతినిన్!
దుర్మతివీడు మానవా!దొరలి పోవుం సిరులెల్లన్!
6.గర్భగత"-దొర్లాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.స.భ.మ.భ.భ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుర్మదచిత్త మొప్పుచున్!దొరతనంబంచు చరించన్!దుశ్చేష్టిత చేతనక్రియల్!
నిర్మలతం జెరచుచున్!నిరుపమంబౌనటు లెంచన్?నిశ్చేష్టితమేర్చు జనులన్!
తుర్మెదవేల!నీతినిన్!దురహమున్మోహనభ్రాంతినిన్!దుశ్చర్యల ముంచదగునే!
దుర్మతి వీడు మానవా!దొరలి పోవుం సిరు లెల్లన్?దుశ్చాతురి ముక్తి గనునే?
7.గర్భగత"-నతయతా"-వృత్తము.
ధృతిఛందము.న.త.య.త.జ.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దొరతనంబంచు చరించన్!దుశ్చేష్టిత చేతనక్రియల్!
నిరుపమంబౌనటులెంచన్!నిశ్చేష్టిత మేర్చు జనులన్?
దురహమున్మోహన భ్రాంతినిన్!దుశ్చర్యల ముంచదగునే?
దొరలిపోవుం సిరులెల్లన్?దుశ్చాతురి ముక్తిగనునే?
8.గర్భగత"-నతోత్తేజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.య.త.జ.స.భ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దొరతనంబంచు చరించన్!దుశ్చేష్టిత చేతనక్రియల్!దుర్మద చిత్తమొప్పుచున్!
నిరుపమంబౌనటులెంచన్!నిశ్చేష్టిత మేర్చు జనులన్!నిర్మలతంజెరచుచున్!
దురహమున్మోహన భ్రాంతినిన్!దుశ్చర్యలముంచదగునే!తుర్మెదవేల నీతినిన్!
దొరలి పోవుం సిరు లెల్లన్?దుశ్చాతురి ముక్తి గనునే!దుర్మతి వీడు మానవా!
9.గర్భగత"-వక్రయా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.య.భ.భ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుర్మద చిత్తమొప్పుచున్!దుశ్చేష్టిత చేతన క్రియల్?
నిర్మలతం జెరచుచున్!నిశ్చేష్టిత మేర్చు జనులన్!
తర్మెద వేల?నీతినిన్!దుశ్చర్యల ముంచ దగునే!
దుర్మతి వీడు మానవా!దుశ్చాతురి ముక్తి గనునే?
10,గర్భగత"-చిత్తోన్మాద"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.భ.భ.జ.స.భ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దుర్మదచిత్త మొప్పుచున్!దుశ్చేష్టిత చేతనక్రియల్!దొరతనంబంచు చరించన్!
నిర్మలతంజెరచుచున్!నిశ్చేష్టితమేర్చు జనులన్!నిరుపమంబౌనటు లెంచన్?
తుర్మెదవేల!నీతినిన్!దుశ్చర్యలముంచదగునే?దురహమున్మోహనభ్రాంతినిన్
దుర్మతివీడు మానవా!దుశ్చాతురి ముక్తి గనునే?దొరలిపోవుం!సిరులెల్లన్?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

23, నవంబర్ 2019, శనివారం

రసాంఘ్రి,మత్తరజినీ,ఉపమా,ససమా,లోకతీరు,ధూమక,చెరపు,ప్రతీక,కేశినీ,హైన్యతా,గర్భ"-మహేంద్ర"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

  జైశ్రీరామ్.
రసాంఘ్రి,మత్తరజినీ,ఉపమా,ససమా,లోకతీరు,ధూమక,చెరపు,ప్రతీక,కేశినీ,హైన్యతా,గర్భ"-మహేంద్ర"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         
"-మహేంద్ర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.మ.జ.ర.జ.న.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెడుటూహల చైదాలన్!చేతనాల!మోసపూర్ణతన్!చెరుప ఘనుల ఖ్యాతినిన్
పడనేలను?పాపాలన్!పాతకాల హీనదుస్థితిన్! పరువు నిలువ దెన్నడున్?
కడు స్వార్థము కాటేయున్!ఘాతుకాన నిల్వబోకుమా!కరటుతనము మానుమా!                                                                                  
గడి మీరకు!ద్రోహాత్మన్!కౌతుకాన!ముక్తి కోరుమా!కరము సురల ధ్యానివై?
1.గర్భగత"-రసాంఘ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గగ.గణములు.వృ.సం.28,
ప్రాసనియమము కలదు.
చెడుటూహల చైదాలన్!
పడనేలను?పాపాలన్!
కడు స్వార్ధము కాజేయున్!
గడి మీరకు!ద్రోహాత్మన్!
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
చేతనాల మోస పూర్ణతన్!
పాతకాల హీన దుస్థితిన్?
ఘాతుకాన నిల్వ బోకుమా!
కౌతుకాన ముక్తి కోరుమా!
3.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.192.
ప్రాసనియమము కలదు.
చెరుప ఘనుల ఖ్యాతినిన్!
పరువు నిలువ దెన్నడున్?
కరటు తనము మానుమా!
కరము సురల ధ్యానివై!
4.గర్భగత"-ససమా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెడు టూహల చైదాలన్!చేతనాల మోస పూర్ణతన్?
పడ నేలను?పాపాలన్!పాతకాల హీన దుస్థితిన్?
కడు స్వార్ధము కాజేయున్!ఘాతుకాన నిల్వ బోకుమా?
గడి మీరకు ద్రోహాత్మన్!కౌతుకాన ముక్తి కోరుమా?
5.గర్భగత"-లోకతీరు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల మోస పూర్ణతన్!చెరుప ఘనుల ఖ్యాతినిన్?
పాతకాల హీన దుస్థితిన్?పరువు నిలువ దెన్నడున్?
ఘాతు కాన!నిల్వ బోకుమా!కరటుతనము మానుమా!
కౌతుకాన!ముక్తి కోరుమా! కరము సురల ధ్యానతన్!
6.గర్భగత"-ధూమక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.న.ర.స.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల మోస పూర్ణతన్!చెరుప ఘనుల ఖ్యాతినిన్?చెడుటూహల చైదాలన్!                                                    
పాతకాల హీన దుస్థితిన్?పరువు నిలువ దెన్నడున్?పడ నేలను?పాపాలన్!                                                      
ఘాతు కాన నిల్వ బోకుమా!కరటు తనము మానుమా!కడు స్వార్ధము కాటేయున్!                                          
కౌతుకాన ముక్తి కోరుమా!కరము సురల ధ్యానివై!గడి మీరకు ద్రోహాత్మన్!                                                        
7.గర్భగత"-చెరపు"-వృతము.
అత్యష్టీఛందము.న.న.ర.స.స.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెరుప ఘనుల ఖ్యాతినిన్?చెడు టూహల చైదాలన్!
పరువు నిలువ దెన్నడున్?పడనేలను?పాపాలన్!
కరటు తనము మానుమా!కడు స్వార్ధము కాటేయున్?
కరము సురల ధ్యానివై!గడి మీరకు!ద్రోహాత్మన్!
8.గర్భగత"-ప్రతీక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.స.స.మసజ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెరుప ఘనుల ఖ్యాతినిన్?చెడు టూహల చైదాలన్!చేతనాల మోసపూర్ణతన్!                                                    
పరువు నిలువ దెన్నడున్?పడ నేలను?పాపాలన్!పాతకాల హీన దుస్థితిన్?                                                      
కరటు తనము మానుమా!కడు స్వార్ధము కాటేయున్?ఘాతుకాన! నిల్వ బోకుమా?                                          
కరము సురల ధ్యానివై!గడి మీరకు!ద్రోహాత్మన్!కౌతుకాన!ముక్తి కోరుమా!                                                        
9.గర్భగత"-కేశినీ"-వృత్తము
అత్యష్టీఛందము.ర.జ.ర.స.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల!మోస పూర్ణతన్!చెడు టూహల చైదాలన్!
పాతకాల!హీన దుస్థితిన్?పడ నేలను?పాపాలన్!
ఘాతుకాన!నిల్వ బోకుమా?కడు స్వార్ధము కాటేయున్?
కౌతు కాన!ముక్తి కోరుమా!గడిని మీరకు ద్రోహాత్మన్!
10,గర్భగత"-హైన్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.జ.త.న.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల మోస పూర్ణతన్!చెడుటూహల చైదాలన్!చెరుప ఘనులఖ్యాతినిన్!                                                      
పాతకాల హీన దుస్థితిన్?పడ నేలను?పాపాలన్!పరువు నిలువ దెన్నడున్?                                                      
ఘాతుకాన!నిల్వ బోకుమా?కడు స్వార్ధము కాటేయున్?కరటు తనము మానుమా!                                          
కౌతుకాన!ముక్తి కోరుమా!గడి మీరకు ద్రోహాత్మన్!కరము సురల ధ్యానివై?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

22, నవంబర్ 2019, శుక్రవారం

కాశీపత్యవధానులు గారు...సీత చేత రాముని చేత పలికించిన చమత్కార భాషణము ప్రహేళిక.

1 comments

 జైశ్రీరామ్.
ఆరులారా!
వివాహాల లో వధూవరులు తలంబ్రాలు పోసుకున్న తర్వాత 
వారి చేత పేర్లు చెప్పించడం ఒక వేడుక. 
కాశీపత్యవధానులు గారు...సీత చేత రాముని చేత పలికించిన చమత్కార భాషణము పద్య రూపములో ఎంత మనోజ్ఞంగా ఉందో చూడండి.
సీతను రాముని పేరు చెప్పమని అంగనలు అడుగగా సీత సిగ్గుతో
వరుని పేరే మనియెద'రా'?
సరస 'మ' యుక్తం బైన స్వామి యగుసుడీ
పరికించి తెలిసికొండని
ధరణీ సుత వ్రీడ తోడ తరుణుల కనియెన్.
సాధారణ భావం :-వరుని పేరు యేమని అంటారా? మీ సరసము యుక్తముకాదు.ఆయనను స్వామి అంటారు.
కవి చమత్కారం :--' 'రా' సరసన 'మ' యుక్తము యైన స్వామి యనగా ఆయన పేరు
'రామస్వామి' .అని సీత చేత అనిపించారు కాశీపత్యవధానులు గారు.
-------------------------------------
తరువాత రాముని చేత సీతపేరు చెప్పించిన పద్యము చూడండి.
చరణముల కడన్ బొసఁగెడు మీకి 'సీ'
వధువు పేరు దెల్పవలె నె మహి'త'
నయ యట౦ద్రు గాన నా రాణి పేరుగా
తెలిసికొనుడు మీకు తెలివి లేదె?
సాధారణ భావం:--కాళ్ళ దగ్గర పడియుండు మీకు(చెలి కత్తెలు,దాసీజనులు)యిసీ
వధువు పేరు తెలుపవలెనట .మహి తనయ =దొడ్డ నీతి గలది అయిన నా రాణి పేరు తెలిసి కొనండి . మీకు తెలివి లేదే?
కవితా చమత్కృతి:-- చరణముల కడ పొసఁగెడు అనగా పాదముల చివర నున్నది
యని భావం.మొదటి పాదము లోచివర 'సీ' రెండవ పాదము లో చివర 'త',మూడవ పాదం చివర 'గా' నాల్గవ పాదం చివర 'దే' ఆమె పేరు సీత గాదె ?
అని రాముని చేత అని పించారు.
కాశీపత్యవధానులు గారి మేధస్సును ఎంత ప్రశంసించినను తక్కువే.
జైహింద్.

21, నవంబర్ 2019, గురువారం

శతావధాని డా.ఆర్.గణేశ్ గారి సంస్కృత అవధానము

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, నవంబర్ 2019, బుధవారం

శ్రీమద్దర్శనమ్ శర్మ ప్రశంసలందుకొనిన బ్రహ్మశ్రీ చాగంటి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

18, నవంబర్ 2019, సోమవారం

శ్రీ చాగంటి సం’దర్శనమ్.

0 comments

జై శ్రీరామ్

జైహింద్.

10, నవంబర్ 2019, ఆదివారం

రఘువంశము సంస్కృత కావ్య బోధనము

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

4, నవంబర్ 2019, సోమవారం

సంస్కృత భాషాధ్యయనము ౧౭.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

3, నవంబర్ 2019, ఆదివారం

సంస్కృత భాషాధ్యయనము ౧౬.

2 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

2, నవంబర్ 2019, శనివారం

సంస్కృత భాషాధ్యయనము. ౧౫.

0 comments

జైశ్రీరామ్. 
జైహింద్.

1, నవంబర్ 2019, శుక్రవారం

సంస్కృత భాషాధ్యయనము ౧౪.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.