జై శ్రీరామ్.
శ్లో. విద్యాసు శ్రుతిరుత్కృష్టా - రుద్రైకాదశనీ శ్రుతౌ తత్ర పఞ్చాక్షరీ తస్యాం - శివ ఇత్యక్షర ద్వయమ్.
గీ. విద్యలందున వేదంబు, వేదమునను
రుద్రయేకాదశకమును, రుద్రమందు
ప్రముద పంచాక్షరియు, కన వానియందు
శివయనెడి రెండు వర్ణముల్,శ్రేష్టమెన్న.
భావము. విద్యలలో వేద విద్య ఉత్కృష్టమైనది. వేద విద్యలో ఏకాదశరుద్రములు శ్రేష్టమైనవి. వాటిలో శివ పంచాక్షరి, అందునా శివ అను రెండక్షరములు శ్రేష్టమైనవి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.