జైశ్రీరామ్.
శ్లో ఉద్ధరేత్ ఆత్మ న్ ఆత్మానమ్ ఆత్మానమ్ అవసాదయేత్ఆత్మైవ హి ఆత్మానో బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః
తే.గీ. తానె యుద్ధరించుకొనును తనను మనిషి.
తానె పతనహేతువగును తనకు చూడ.
తనకు మిత్రుఁడు చూడగ తానె యగును.
తనకు శత్రువు తానెగా తలచ మనిషి.
భావము.
మనిషి ఉద్ధరింపబడటానికి అధోగతి పాలుకావడానికి తనకు తానే కారణం. అందువలను తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే తనకు బంధువు మరియు శత్రువుకూడాను, మంచి కోరటం, ఆచరించటం వలన మనస్సు బంధువు గా, మన ని ఉద్ధరిస్తుంది. చెడ్డ పనులు ఆలోచనలు వలన మన మనస్సు శత్రువు గా మనలను అధోగతి పాలు చేస్తుంది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.