గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, డిసెంబర్ 2016, శనివారం

శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్. దిమిలి. నా మిత్రులు, శిష్యులు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!  ౦౧ - ౦౩ - ౧౯౭౪ వ తేదీన నేను శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్ లో ప్రథమాంధ్రోపాధ్యాలుగా బాధ్యత చేపట్టినాను. ౮వతరగతి నుండి చదివి పదవ తరగతి పరీక్షలకు వెళ్ళిన విద్యార్థినీ విద్యార్థులు, నాతోపాటు ఆనందోత్సాహాలతో ఉపాధ్యాయ వృత్తి నెరపుచున్న నా మిత్రులు. అందరూ ఆదర్శ జీవనులే. వారందరిలోని మంచి లక్షణములన్నీ నన్ను చేరుట చేతనే నేను చెడ్డవాడిగా అనిపించుకోవటానికి అవకాశం లేక మంచు పేరు నా కాపాదింపబడింది.
నిరతము మిత్ర సంస్కృతిని నేర్పున నన్గని మెల్గుచుండి, నన్
గరుణను ప్రోత్సహించుచు ప్రకాశముఁ గొల్పిరి తోటి వారలా
గురువులు నాకు మిత్రులును, కోవిదులున్, గురు సన్నిభుల్. సదా
కరుణను చూపు వారలకు గౌరవమొప్ప నమస్కరించెదన్.
వారందరికీ నా అభినందన పూర్వక కృతజ్ఞతలు.
ఈ నా విద్యార్థులనేకమంది తాము చేపట్టిన వృత్తులలో నిపుణత చూపి మాకు మంచి పేరు తెచ్చి, పదవీ విరమణ కూడా చేసియున్నారు.
వారందరికీ నా శుభాశీస్సులు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అమృత తుల్య మైన మీ చక్కని అనుభవాలను మాకందించినందులకు ధన్య వాదములు
ఎందు కంటే మన అనుభవాలు అనుభూతులు ఆత్మీయులకి పంచినందున కలిగే ఆనందం వర్ణనాతీతం
అభినందన మందారములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.