గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2016, శనివారం

31 - 12 - 2007 న ఆవిష్కరించిన యువతరంగం - కళాశాల విద్యార్థుల ద్వైమాసిక పత్రిక.

జైశ్రీరామ్.
 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చోడవరం, (విశాఖపట్టణం జిల్లా)లో నేను తెలుగు ఉపన్యాసకుఁడుగా విధులు నిర్వహించే రోజులలో విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు వీలుగా  లిఖిత ద్వైమాసపత్రిక "యువతరంగం" పేరుతో ప్రారంభించినాను. విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే సహృదయులైన మహనీయులకీ విషయం తెలిపి, వారి ఆశీర్వాదం అర్థించేవాడిని. వారు పత్రిక చదివి, ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులతోపాటు ఆ పత్రికలో ప్రచురితమైన రచయితలైన విద్యార్థులకందరికీ ఆరితోషకం ఇచ్చేవారు. నా ఉద్యోగ జీవితంలో విజయానికి ఇది ఎంతగానో సహాయపడటమే కాక, అనేకమంది విద్యార్థులు ర్ర్ ప్రోత్సాహంతో ఎంతగానో అభివృద్ధిపొంది నేడు చక్కని ఉద్యోగాలు చేసుకొంటూ ఆదర్శ భారతీయులుగా జీవిస్తున్నారు. 2005 నుండి 2008 వరకు నిరాఘాటంగా ఈ ప్రక్రియను కొనసాగించగలిగాను. 30-6-2006ని నేను పదవీ విరమణ చేసిననాడు కూడా ఒక పత్రిక విడుదలచేయడం జరిగింది. దురదృష్ట వశాత్తు ఆ పత్రిక అప్పటితో ఆగిపోయింది.
31 - 12 - 2007 న ఆవిష్కరించిన యువతరంగం - కళాశాల విద్యార్థుల ద్వైమాసిక పత్రిక.
ఉత్సాహవంతులైన విద్యార్థులే ఈ పత్రికా నిర్వహణబు కొనసాగించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఆదైవ కృప ఎలాగుందో తెలియదు.
నమస్తే.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషం .శుభాభి నందనలు + నూతన సంవత్సర శుభాకాంక్షలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.