గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

శ్రీమదాంధ్ర కథా సరిత్సాగరము . . ..రచన ఓలేటి.

జైశ్రీరామ్.
శివుఁడు పార్వతీదేవికి ఏ కాంతముగా చెప్పిన కథయే కథాసరిత్సాగరము.  పాండవ వంశమువాఁడైన ఉదయన మహారాజు (వత్సరూజు) కుమారుఁడు నర వహన దత్తుఁడు విద్యాధర చక్రవర్తి ఐన కథ. కథా నాయిక మదనమంచుక. ఇది ఆంధ్ర శాతవాహనుని యాస్థాన విద్వాసుఁడైన గుణాఢ్యుఁడు మరియొక పండితునితో  కలిగిన వాదనలో పరాభూతుఁడై చేసుకొనిన ప్రతిజ్ఞానుసారము సంస్కృత భాషను విడిచి రాజాస్థానమును వదలి పోవుచు ఒక అరణ్యములో పిశాచగ్రస్థుఁడై యా పిశాచము బోధించగా పిశాచి భాషను నేర్చుకొని, వానిద్వారా బృహత్కథ యను పేరుతో సప్త లక్షాశ్లోక పరిమితమైన గ్రంథమును వ్రాసి, యాంధ్రసాతవాహన మహారాజుకు పంపఁగా ఆ రాజు దానిని తిరస్కరించెను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కధాసరిత్సాగరము ఇది అద్భుతమైన గ్రంధ రాజము .గుణాఢ్యుడి బృహత్కధ .తప్పక చదివి తీరవలసిన గ్రంధము .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.