జైశ్రీరామ్.
మిత్రులారా!
తే. 04.08.2016 న సాయంత్రం 6.00 గంటలకు
ఖమ్మం పట్టణము,
మామిళ్ళగూడెం లోని
గాయత్రీ భవనమందు
సత్కవిశిఖామణి శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి విరచిత
'శ్రేయస్కరా శ్రీధరా'
(శ్రీధర శతకము)
ఆవిష్కరణ సభ.
సహస్రావధాని, అవధాన రాజహంస
బ్ర॥శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం గారు పుస్తక సమీక్ష చేస్తారు.
ఈ సభలో పాల్గొనే వారికి ఇది అత్యద్భుతమైన సదవకాశం.
ఎందుచేతనంటారా.
వేదాంతాద్భుతసార మీశతకమౌన్, విజ్ఞాన భాండంబునౌన్.
శోధించున్ గుణ దోషముల్ మనసునన్, జూపించు సన్మార్గమున్,
నీదౌ పాద పరాగ లబ్ధ ఫలమున్ జిజ్ఞాసికందించు నో
శ్రీ ధాత్రీశ! అనంత కృష్ణ హృదయా! శ్రేయస్కరా! శ్రీధరా!
మాయామోహములెల్లఁ బాపు, జగతిన్ మాన్యత్వమున్ గొల్పు, స
ద్ధ్యేయంబున్ కలిగించు, కాంచు మదిలో దీపించు సద్రూపమై.
శ్రేయోదాయక సత్ప్రభావయుత రాశీభూత వేదాంతమై
జ్ఞేయంబౌన్. శతకంబు, పాఠకులకున్ శ్రేయస్కరా! శ్రీధరా!
నారు మంచిదైన నల్లరేగడి భూమి
భవ్య ఫలమినిచ్చి బ్రతుకఁ జేయు.
శ్రీ అనంతకృష్ణ శ్రీధర శతకము
నల్లనైన మతిని తెల్లఁ జేయు.
అవధాన రాజహంసయె
ప్రవిమల సత్ శతక వినుత ప్రతిభను తెలుపున్.
శ్రవణాద్భుత సుమపేశల
కవితామృత మందుకొనుట ఘన సత్ఫలమే.
జైహింద్.