గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, నవంబర్ 2015, శుక్రవారం

శుక్ర గ్రహమునకు సంబందించిన మేడి మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.

జైశ్రీరామ్
శుక్రుడు:-మేడి
మేడి చెట్టు సమిదలతో హోమంచేస్తే వివాహ సమస్యలు,వైవాహిక సంబంద సమస్యలు ఉండవు.
గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు).
దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు ఉంటారు.
దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది.
దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుంది.

మేడి
మేడి చెట్టు పెద్ద వృక్షం. ఇది మర్రిచెట్టును పోలి ఉంటుంది.
మేడిపండు.
అత్తి చెట్టు. ఇది చిన్న మొక్క
అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్‌, సీమ మేడిపండు... ఎలా పిలిచినా ఒకటే పండు. ఇది కంటికి చూడగానే ఆకట్టుకోదు. తీపి, పులుపు, వగరు కలిసి రుచి అంత అమోఘంగానూ ఉండదు. మిగతా పళ్లలా పెద్ద ప్రాచుర్యమూ, ప్రచారమూ లేదు. ధర చూడబోతే పెద్ద ఖరీదేమీ కాదు. కానీ జనం వీటిని చూడగానే కొనేద్దాం అనుకోరు. అయినా పాపం, ఈ పండు అవేవీ మనసులో పెట్టుకోదు. బోల్డన్ని పోషకాలు అందిస్తుంది. కనుక అందుకుని ఆదరించాల్సింది మనమే! పైగా దానివల్ల ప్రయోజనమూ మనకే!
అంజూర పండే కాదు, ఎండువీ అంతే ఆరోగ్యం. ఇది అనేక స్వీట్లల్లో ఉపయోగిస్తారు.
అంజూర్‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటివి తక్కువ.
కానీ ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడనివారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన కేల్షియం, ఐరన్‌ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి అంజూర్‌ తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు.
కడుపులో మంట, అజీర్తి, పేగుపూత వంటివి తలెత్తకుండా అంజూర్‌ కాపాడుతుంది.
ఇందులోని పొటాషియం గుండెకు సమస్యలు రానివ్వదు.
రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఆకలితో బాధపడేవారు అంజూర్‌ తినొచ్చు. ఈ పండులోని ఇనుము, కేల్షియం, ఫైబర్‌ ఆకలిని తగ్గిస్తాయి.
నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది.
వీటి పై తొక్క గట్టిగా ఉంటుంది. ఇష్టంలేకుంటే వాటిని కాసేపు నీటిలో ఉంచి తొక్కతీసి తినొచ్చు.
ఎండు అంజూర్‌ పళ్లలో మినరల్స్‌ అధికం. అవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి.
వీటిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర పట్టడానికి సాయపడతాయి.
ఎలర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది.

ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును మేడి చెట్టుకు నరసిం హావతారంలో హిరణ్య కశిపుని చంపాక ఆ రాక్షస రక్తానికి చేతులు మంటలు పుట్టినందున , లక్ష్మీ దేవి అక్కడే ఉన్న మేడి ఆకులతో ఆ చేతులు తుడిచిందట .అందుకని నరసిం హుడు దానికి వరమిచ్చాడట ." ఈచెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేస్తే అష్ట సిద్ధులు కలుగుతాయని . ఇక చింతా వారు చెప్పిన ఉపయొగాలు సరేసరి.నిజానికి మనపూర్వీకులు ఇలా ప్రకృతి వైద్యాలనే చేసేవారు.ఈనాగరికత మోజులో అవన్నీమరుగునపడిపోయాయి.
ఇప్పడికైనా తెలుసుకో గలిగి నందుకు ఆనందంగాఉంది.ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.