జైశ్రీరామ్.
పెట్టని కోట సింహగిరి పెన్నిధి శ్రీనరసింహు సత్కృపన్
పట్టుగ సాగకుండునొకొ! భద్రముగా శత సద్వధాన మీ
పట్టున రామభట్ల కవి భాస్కర! సద్గుణ పార్వతీశ్వరా!
దిట్ట సుచిత్ర, బంధ కవి తేజము నీ ప్రభ పెంచుగావుతన్.
పార్వతీశ్వర శర్మా! అభినందనలు.
జైహింద్.
3 comments:
ఏమండీ చింతా వారు,
'సాహసోపేత' అని ఎందుకంటున్నారు ?
జిలేబి
జిలేబీ గారూ!
బాలుఁడు పార్వతీశ్వరుఁడు. ప్రశ్నలు వందకు మించియుండు, కా
వ్యాలననేకముల్ చదివి భారతి పాద రజంబునొందుటన్
హేలగ నష్ట పృచ్ఛకులకేకబిగిన్ పరితృప్తిఁ గొల్పు.నీ
బాలు శతావధానమిది ప్రప్రథమంబగుటన్ వచించితిన్
నమస్కారములు
చాలా చక్కగా చెప్పారు. చిన్నతనము నందే అంతటి పాండితీప్రకర్ష కలిగి ఉండటం , సరస్వతీ కటాక్షం.శ్రీ కొండేపూడి సుబ్బారావుగారి శత జయంతి సందర్భముగా [ అంటే ఆయన మాపెద్ద మేనత్తగారి భర్త ] చాలా ఆనందంగా ఉంది . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.