జైశ్రీరామ్.
రవి:-తెల్లజిల్లేడుతెల్లజిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది.
తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి.
కళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి.
కోప స్వభావాలు తగ్గుతాయి.తలనొప్పి భాధలు ఉండవు.
ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.
తెల్ల జిల్లేడు
తెల్ల జిల్లేడు (Calotropis procera) పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇవి ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ మరియు దక్షిణ ఆసియా మరియు ఇండోచైనా ప్రాంతాలలో కనిపిస్తాయి.దీనిని హెబ్రూ భాషలో "సోడమ్ ఏపిల్" (Apple of Sodom) అంటారు. సంస్కృతంలో అలార్క లేదా శ్వేతార్క అంటారు.
ఇతర ఉపయోగాలు
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.
లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.
ఆయుర్వేదంలో
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
తెల్లజిల్లేడు యొక్క ఉపయోగాలను తెలియ జెప్పినందులకు ధన్య వాదములు. అసలు జిల్లేడు అంటేనే ఒకదురభిప్రాయం ఉన్న వారిలో ఆఉద్దేశాన్ని తొలగించారు చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.