గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2015, బుధవారం

బుధ గ్రహమునకు సంబందించిన ఉత్తరేణి మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.

జైశ్రీరామ్
బుధుడు:- ఉత్తరేణి.
ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాదులు తగ్గుతాయి.
జీర్ణ సంభంధ సమస్యలు ఉండవు.
ఉత్తరేణి పూల్లతో గాని, వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి.
ఉత్తరేణి ఆకులు, గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతాయి.
ఉత్తరేణి
స్ర్తి జననేంద్రియంలో నొప్పి (వల్వోడైనియా)
ఉత్తరేణి ఆకులను రెంటిని జననేంద్రియం లోపలకు ప్రవేశపెడితే వెంటనే జననేంద్రియంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. (గదనిగ్రహం)
ప్రసవానంతరం జననేంద్రియంలో వచ్చే నొప్పి
ఉత్తరేణి వేర్లు, గలిజేరు వేర్లు వీటిని రెంటినీ ముద్దగా నూరి బాహ్యంగా ప్రయోగిస్తే ప్రసవానంతరం జననేంద్రియంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. (వృందమాధవ)
నిద్రా రాహిత్యం
ఉత్తరేణి మొక్కతో తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటే నిద్ర వస్తుంది. (హారీత సంహిత)
ఆంత్రక్రిమి
ఉత్తరేణి మొక్క, దిరిశెన చెక్కల రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆంత్రక్రిములు నశిస్తాయి. (సుశృత సంహిత, ఉత్తర స్థానం)
ఉత్తరేణితో గృహ చికిత్సలు
ఒంటి కణత నొప్పి
ఉత్తరేణి గింజల చూర్ణాన్ని గాఢంగా ఆఘ్రాణిస్తే ఒంటి కణత నొప్పి తగ్గుతుంది. ఉత్తరేణి గింజల గాఢమైన వాసన వల్ల తలలో చేరిన కఫం పలుచబడి వెలుపలకు వచ్చేసి, తల లోపల వత్తిడి తగ్గుతుంది.
పంటి నొప్పి, దంతశూల, పిప్పిపళ్లు
ఉత్తరేణి ఆకు రసాన్ని బాహ్యంగా ప్రయోగించాలి. ప్రయోగ విధానం తెలుసుకుందాం. ఉత్తరేణి ఆకులను గుప్పెడు తెచ్చి, రసం తీసి, దానిలో దూదిని తడిపి దంతాల మీద ఉంచితే పంటినొప్పి తగ్గుతుంది.
నోటి దుర్వాసన, దంతాలు కదలటం, చిగుళ్లవాపు
ఉత్తరేణి కొమ్మను ముఖం పుల్లగా వాడితే చిగుళ్లు గట్టిపడి దంతాలు కదలకుండా ఉంటాయి. అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు వంటి దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్యంలో కూడా దంతాలు పూర్తి ఆరోగ్యంతో తళతళ మెరుస్తాయి.
చెవుడు
ఉత్తరేణి తైలాన్ని చెవిలో వేసుకోవాలి. ప్రయోగ విధానం చాలా సులభంగా ఉంటుంది. ఉత్తరేణి మొక్కను పంచాంగ సహితంగా తెచ్చి, బాగా కడిగి ముద్దగా దంచి, రసం పిండి, దానికి సమాన భాగం నువ్వుల నూనె కలిపి, మంట మీద పక్వం చేయాలి. జలీయాంశం మొత్తం ఆవిరై కేవలం తైల భాగం మాత్రమే మిగిలేంత వరకూ ఉడకబెట్టి, ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ 2-3 చుక్కల చొప్పున కొద్దిగా వేడిచేసి రెండు చెవుల్లోనూ వేసుకుంటే చెవుల నుంచి జరిగే కర్ణస్రావాలు తగ్గుతాయి.
విసూచిక (గ్యాస్ట్రోఎంటిరైటిస్)
ఉత్తరేణి వేరును ముద్దగా నూరి నీళ్లతో తీసుకుంటే వాంతులు, విరేచనాలు ఏకకాలంలో అవ్వటం తగ్గుతుంది. (్భవప్రకాశ)
సిద్మకుష్ఠం (బూడిద గుమ్మడి పువ్వులను పోలినట్లుండే పొట్టురాలే చర్మవ్యాధి)
ముల్లంగి గింజలను ఉత్తరేణి ఆకుల స్వరంతోగాని లేదా ఉత్తరేణి వేరు ముద్దతో గాని కలిపి నూరి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మం మీద పొట్టులాగా రాలే చర్మవ్యాధులు తగ్గుతాయి. దీని తరువాత అరటి వేరును బూడిదగా మండించి క్షారాన్ని తయారుచేసి పసుపుతో కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. (వృందమాధవ)
(క్షార ప్రక్రియ: ఒక కుండలో మూలిక భాగాలను కొద్దికొద్దిగా వేస్తూ బూడిదగా మండించాలి. దీనికి 6 రెట్లు నీళ్లు కలిపి, వడపోసి, ఆ నీటిని తిరిగి పూర్తిగా ఆవిరయ్యేలా మరిగిస్తే అడుగున ఉప్పులాంటి పదార్థం మిగులుతుంది.)
సిద్మకుష్ఠం (పొట్టురాలే చర్మవ్యాధి)
ఉత్తరేణి మొక్క క్షారాన్ని బాహ్యంగా ప్రయోగిస్తే సిద్మకుష్ఠం తగ్గుతుంది. (వైద్య మనోరమ)
మూత్ర మార్గంలో రాళ్లు తయారవటం (మూత్రపిండాల్లో రాళ్లు)
ఉత్తరేణి మొక్క, నువ్వుల కట్టె, అరటి వేరు, మోదుగ పంచాంగాలు, బార్లీమొక్కలు వీటిని బూడిదగా మండించి, క్షార ప్రక్రియతో క్షారాన్ని తయారుచేసి, 250 మి.గ్రా. నుంచి 500 మి.గ్రా. వరకూ నీళ్లతో గాని లేదా శుద్ధిచేసిన గొర్రె మూత్రంతో కలిపి గాని తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు పడిపోతాయి. (అష్టాంగ హృదయం, చికిత్సా స్థానం)
మూత్రవిసర్జన నొప్పిగా ఉండటం (డిసూరియా)
ఉత్తరేణి వేరును ముద్దగా నూరి గాని లేదా చూర్ణరూపంలో గాని పాలతో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. 
(వైద్య మనోరమ)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
ఉత్తరేణి యొక్క ఉపయోగములు ,దాని విశిష్టతను తెలియ జేసినందులకు ధన్య వాదములు
ఇలా ఒక్కొక్క చెట్టు యొక్క ఉపయోగములను చక్కగా తెలుసుకుని ఆచరించ గలిగితే మరేఇతర వైద్యములు అవుసరము ఉండదు కదా . చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.