జైశ్రీరామ్.
మూడు కాలము లీవు ముజ్జగంబులు నీవు మూల పూరుషుఁడీవు మొదలు నీవు.
మునిజనావళివీవు, ఘన గుణావళివీవు. పుణ్యకార్యములీవు, పూజ్యుఁడీవు, భక్తి భావము నీవు భవ బంధనములీవు, కర్త కర్మలు నీవు భర్తవీవు. కలుషాదులకు మూల కారణంబును నీవు, గౌరవ సద్వృత్తి కరణుఁడీవు. విశ్వరూపా!సహస్రాక్ష! వేద వేద్య! పాద సాహస్ర సంశోభ! పద్మ నాభ!. పాప పుణ్యంబులను బాపి, భవ్యమైన నీదు పాదాన రేణువై నిలువనిమ్ము.
జైహింద్.

1 comments:
పద్యం చాలా బాగుంది గురువుగారూ
ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.