గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, నవంబర్ 2015, శనివారం

అసహాయః సమర్ధోపి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. అసహాయః సమర్ధోపి తేజస్వీ కిం కరిష్యతి?
నిర్వాతే జ్వలతే వహ్నిః స్వయమేవోపశామ్యతి.
ఆ.వె. పరుల తోడు లేక బలవంతుఁడైనను
చేయ లేడు పనులు చేవ చూపి.
గాలి తోడు లేక ఘనమైన యగ్నియు
నారిపోవుఁ గాదె దారి లేక. 
భావము. శూన్యంలో అగ్ని తనంతట తానే ఉపశమిస్తుంది, కారణం తనకి తోడుగావుండవలసిన గాలి, ఆమ్లజని తగినంత మోతాదులో దొరకక తనంతతానే ఆరి పోతుంది. అలాగే ఎంతటి సమర్ధుడైనా తేజోవంతుడైనా ఇంకొకరి సహాయం లేకపోతే ఏమీ చేయ లేడు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును .బంగారపు పళ్ళానికైనా గోడ చేరువ కావాలంటారు . ఎంతటి వారికైనా ఒక మంచి తోడు చాలా అవుసరం . మంచి సంగతి చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.