గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, నవంబర్ 2015, ఆదివారం

రాహు గ్రహమునకు సంబందించిన గరిక మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.

జైశ్రీరామ్.
రాహువు:-గరిక.
గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి.
గరిక రసాన్ని గజ్జి, చర్మంపైన ఉన్న కురుపులపై పెట్టిన చర్మరోగాలు నివారించబడతాయి.
దెబ్బతగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.
గరిక
గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు. శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి. 
గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. గరికతో చేసిన అంజనాన్ని ప్రతిరోజూ ధరిస్తే అన్ని పనులు నెరవేరుతాయి. ఇంకా గరిక రసం తాగితే దేహంలోని సమస్త వ్యాధులు నయం అవుతాయి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గరిక యొక్క విసిష్టత , దాని ఉపయోగములు తెలియ జెప్పారు .ఖరీదు లేనిదీ అందరికీ అందుబాటులో ఉండేదీ మంచి ఉపయుక్త మైనదీ. చాలా బాగుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.