జైశ్రీరామ్.
బీహార్ ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీనితీష్ కుమార్ గారికి హృదయ పూర్వక అభినందనలు.
01 - 04 - 2016 నుండి బీహార్ రాష్ట్రములో మద్యపానమును పూర్తిగా నిషేధించటానికి వర్యలు చేపట్టి నందులకు గర్విస్తూ, మీరు ముఖ్యమంత్రి అయినందులకు చాలా సంతోషిస్తున్నాము. నిజంగా మీరు తీసుకొన్న ఈ నిర్ణయం పూర్తిగా కార్యరూపం దాలిస్తే గాంధీ మహాత్ముఁడు కలలు కన్న భారతికి మీరు నాందీ పలికినవారవతారు.
మీరు చేపట్టిన ఈ సత్కార్యము మిగిలిన రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం కావాలని, భారతమాత ఆనందంతో పులకరించాలని మనసారా కోరుకొంటూ, మీరు చేపట్టే మంచి పనులకు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సహకరించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
3 comments:
ఈ చర్య కితం సారి తీసుకుని ఉంటే జనం నమ్మేవారేమో! ఇప్పుడు అసాధ్యం, కొంతమంది బాగుకే ఇది. విజయం కావాలనే ఆకాంక్ష
నమస్కారములు
సంకల్ప బలముంటే సాధ్యం కానిదేదీ లేదు. తప్పక నెరవేరు గాక
శ్రీ నితీష్ గారిని అపర గాంధీ అనేసారు ! ఇంకా ఏమేమి జరుగ బోతుందో !
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.