గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2015, శనివారం

స్త్రీరూపాం చింతయే ద్దేవీం, మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. స్త్రీరూపాం చింతయే ద్దేవీం పుంరూపం వా విచిన్తయేత్ |
అథవా  నిష్కలం ధ్యాయే   త్సచ్చిదానంద   లక్షణమ్ || (తంత్రసార:) 

క. చింతింప వచ్చు స్త్రీగను,
చింతింపగ వచ్చు పురుష చిద్రూపముగన్.
చింతింప తగునిరాకృతి,
సంతోషముతో జననిని సచ్చిద్రూపిన్.
భావము. జగన్మాతను స్త్రీ రూపమున చింతింప వచ్చును, లేదా పురుషాకృతిలోనైనను చింతింప వచ్చును. లేదా నిరాకారముగనైనను ధ్యానించ వచ్చును. ఇది సచ్చిదానంద లక్షణము.
జైహింద్.
Print this post

3 comments:

కంది శంకరయ్య చెప్పారు...

అనువాదం అన్న అనుమానం ఏమాత్రం రాకుండా స్వతంత్ర పద్యంలా అలరారుతున్నది. చాలా బాగున్నది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జగమున సుకవులు మెచ్చిన
జగదీశుఁడు మెచ్చినట్లు. సన్మానమదే.
అగణిత! ధన్యుఁడనయితిని.
సుగుణాకర కందివంశ శోభనమూర్తీ!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మేలిమి బంగారం వంటి సాహిత్యాన్ని అందిస్తున్న శ్రీ చింతా వారు శ్లాఘ నీయులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.