గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2013, సోమవారం

శ్రీ కందుల వరప్రసాద్ విరచించిన కేశ బంధ తోటక వృత్తము.

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ కందుల వరప్రసాద్  కేశ బంధ తోటక వృత్తము విరచించిరి. వారి మాటలలతో పాటు వారి రచనను కూడా తిలకించండి.
నేను తోటక వృత్తము నందు ముకుందుని పై వ్రాసిన పద్యమును జుడగలరు.  కేశవునకు కేశ బంధము లో చిత్తగించ గలరు.  

దమనుండు ముకుందుడు దైత్యులకున్
దమకమ్మున బ్రోచును దాసతతిన్
రమణీయములీశు స్ఫురద్గుణముల్
దుమికించును దూరము దుర్దశలన్ 

సమయించు సమస్యలు సారమతిన్
         కమలాప్తుడు భక్తుల గాచు వెసన్              
యమ బాధలు దీరుచు నా క్షణమే
సమకూరును సర్వము సాధనతో

విముఖత్వము జూపక ప్రేమమెయిన్
కమలాలయ దీర్చును కామితముల్
యమపాశము రాదిక యా దరికిన్
మము జేర్పును చిన్మయ మార్గమునన్ 

తప్పులున్న యడల మన్నించి దెలుపగలరు,  
ఇట్లు మీ కందుల వరప్రసాద్.
జైహింద్.
Print this post

5 comments:

Dileep.M చెప్పారు...

2nd Padyam
యమ బాధలు దీరుచు నా క్షణమే
'య' కు 'నా' కు యతి కుదురుతుందా?కొంచెం వివరించగలరు.

Dileep.M చెప్పారు...

l

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! దిలీప్! అ-య-హ - లకు యతి మైత్రి ఉన్నది. యతి బాధలు తీరుచు నా క్షణమే లో ”తీరుచున్ + ఆ క్షణమే” అని గ్రహించ వలసి ఉంది.
అప్పుడు య – ఆ లకు యతి అన్ గ్రహించ వలసి ఉన్నది.

Dileep.M చెప్పారు...

Thanks for your explanation. I'm learning Chandassu , So I asked..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కేశ బంధ తోటకములు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఇది ఆంధ్రామృతం కాదు ప్రసిద్ధ పండితుల కవితామృతం.ఏజన్మ సుకృతమో ఇన్ని చదవ గలుగు తున్నాను ప్రసిద్ద పండితులకు కృతజ్ఞతాభి నందన లు
నిజానికి ఈ పద్యాలను కూడ బలుక్కుని చదవడానికి నాకు కనీసం అరగంట పట్టింది చాలా చాలా బాగున్నాయి హేట్సాఫ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.