గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మార్చి 2013, శనివారం

తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరి కృష్ణ, ఎన్టీయార్ ట్రష్ట్ భవన్ లో శత కవుల సన్మానం

జైశ్రీరామ్.
అర్యులారా! మొన్నను అనగా 21-03-2013 న అంతర్ జాతీయ కవితా దినోత్సవము జరుప బడింది. ఆ రోజున తెలుగు రక్షణ వేదిక  అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరి కృష్ణ,  ఎన్టీయార్ ట్రష్ట్ భవన్ లో శత కవుల సన్మానం చేశారు. శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు ప్రముఖ రంగస్థల, సినీ పద్య రాగాలాపకులు శ్రీ  గోపాల్, మాజీ మంత్రి వర్యులు ఒకరు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ సభలో ఉండి అలరింప జేశారు.
మహానుభావులు పెక్కురు ఈ సభలో సత్కరింప బడ్డారు. అట్టి సత్కారం అందుకొనే భాగ్యం నాకూ ఆ పరమాత్మ ప్రసాదించాడు.
సాహితీ స్పొహూర్తి ప్రదాతలు చక్కని వ్యాఖ్యలతో మేలుకొలిపే మీ వంటి పాఠకులే  యీ సత్కారమునకు నన్ను అర్హునిగా చేసినది అని సగర్వముగా చెప్పుకొన గలను.
నిరంతరము పరిశీలనా దృష్టితో సాహితీ సన్మార్గ సుగామిగా నన్ను మీ వ్యాఖ్యలే తీర్చి దిద్దు చున్నందుకు సర్వదా మీకు నేను కృతజ్ఞుడను.
ఇటువంటి సాహితీ ప్రియ సత్ సంస్థలే సత్ కవులకు ఊపిరి నిచ్చుచున్నదనుటలో ఏమాత్రమూ సందియము లేదు. ఈ కార్యక్రమమును అత్యంత శ్రద్ధా భక్తులతో నిర్వహించిన తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరి కృష్ణకు  అభినందన పూర్వక ధన్యవాదములు తెలియజేసుకొను చున్నాను.
నమస్తే.
జైహింద్.
Print this post

5 comments:

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

సరస పరచూరి గోపాల సరస జేరి
“చింత రామకృష్ణారావు” చిరునగవుల
అందు కొనగ సమ్మానము హాయిమీర
పులకితంబయ్యె నామది పుణ్య చరిత.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శర్మ సద్భావనాయుత సరస వాక్కు
లలరఁ జేసెను నా మది. సులలితమగు
తేట గీతిని వ్రాసిన మేటి సుకవి!
శర్మ వరడ! కృతజ్ఞత. సదయ హృదయ.

Pandita Nemani చెప్పారు...

రామకృష్ణ రావు సుకవి రాజ శేఖరుండహో
సామజాభుడొందె వేడ్క సత్కృతుల్ ఘనమ్ముగా
ఆ మహాను భావునిన్ మహాకవిన్ నుతించెదన్
ప్రేమ మూర్తి కాశిషములివే పొనర్తు నొప్పుగా

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రామ జోగి సుకవి వాక్కు రమ్యమై రహింపగా
ప్రేమ తోడ చూచు చూపు శ్రీగుణాళి గొల్పగా
భూమిపై మహాత్ములన్ ప్రపూజ్యులన్ ముదంబుగా
ధీమతిన్ గనంగ చేయు దివ్య భాగ్య మబ్బెగా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తేట తేట గీతికలతో పండితోత్తములు విరజిమ్ము సుగంధ పరిమళములతో సొగసు లలరు చూ వేదిక నలంకరించిన చిరంజీవి సోదరునికి శుభాభి నందన మందారములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.