శ్లో:-
అనంత శాస్త్రం బహు వేదితవ్యం - స్వల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః.
యత్ సారభూతం తదుపాసితవ్యం - హంసో యథా క్షీరమివాంబు మిశ్రమ్.
గీ:-
ఎఱుగఁ దగు శాస్త్రములు పెక్కులిహమునందు.
కాల మల్పము కావున కలియుగమున,
హంస నీటిని విడి పాలనరయునట్లు,
సారమున్నట్టి శాస్త్రముల్ చక్క గొనుడు.
భావము:-
శాస్త్రములు అనంతముగ నున్నవి. తెలియ తగినది చాలా ఉన్నది. కాలమా స్వల్పముగా నున్నది. విఘ్నములా అనంతముగా కలుగుచునే ఉండును.కావున హంస ఏ విధముగా పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచి వేయునో అదే విధముగా మనము కూడా కావలసినంతమట్టుకు సారభూతమైన దానిని స్వీకరించ వలెను.
Print this post

1 comments:
నిజమే మనం చూసి చదివినవాటి నుంచి అవుసర మైనవి మాత్రమే గ్రహించి , అనవసర మనుకున్నవి విడిచి పెడితే అందరికీ అన్ని విధాలా శ్రేయస్కరం.చాలా మంచి విషయం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.