గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, అక్టోబర్ 2012, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 125.

జైశ్రీరామ్.
శ్లో:-
విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
గీ:- పాండితికి సరికాదిల ప్రభుత చూడ
రాజు పూజింపఁబడు తన రాజ్యముననె,
పండితీయుతులెటనైన ప్రతిభ చేత
పూజలందుట నిక్కము భూమిపైన.
భావము:-
పాండిత్యము, రాచరికము ఒకదానితో మరొకటి పోల్చుటకు వీలు లేదు. రాజు స్వదేశమునందు మాత్రమే పూజింపఁబడును. పండితుఁడు మాత్రము లోకములో ఎక్కడికి వెళ్ళినా పూజింపఁ బడును.
కాబట్టి సాహిత్యపు విలువలు కలిగిన వాటిని పఠిస్తూ ఉండాలి. శోధించి తెలుసుకొంటూ ఉండాలి. అప్పుడు పాడిత్యము అలవడకుండా ఎలా ఉంటుంది. గ్రథాలు చదువుతూ ఉండండి.
జైహింద్.
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

మా చిన్న ప్రయత్నము:

సత్కృతుల నొందును బుధుడు సకల దేశ
ముల నటులగాక తన రాజ్యముననె పొందు
ధారుణీనాథు డుచిత సత్కారములను
భూపతికి పండితునకును బోల్కులేల?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.