జైశ్రీరామ్.
ఆర్యులారా! మనము పూజామందిరమున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాదికములు నిర్వహిస్తూ ఉంటాము కదా! ఐతే మనము పూజా మందిరమునకు ప్రవేశించే సమయంలో ఏమి చెయ్యాలో, ఆసనమును ఏ విధముగా సిద్ధము చేసుకోవాలో మహానుభావులైన పూర్వీకులు వివరించి యున్నారు.
పరిశీలించండి.
శ్లో:- అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమభైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి.
ఈ శ్లోకము పూజా మందిరము లోనికి ప్రవేశము చేయక మునుపు భైరవుని దగ్గర అనుమతి తీసుకొని, జప స్థలమును 12 సార్లు ప్రణవమును ఉచ్చరించుచూ ఉదకముతో సంప్రోక్షించి, ఆ స్థలము పై కూర్మ యంత్రమును లిఖించ వలయును. దానిపై ఆసనము వేయవలెను.
పూజామందిరమున అమర్చుకొన వలసిన ఆసనము.
ఆసనము:- ఆసనము మీద క్రమముగా ధర్భాసనము, కృష్ణాజీనము, చిత్ర కంబళం, వస్త్రమును పరచుకొని దానిపై కూర్చుండవలెను. కూర్చుండుటకు ముందు ఆసనము పూజ చేయ వలెను.ఓం ఆధార శక్త్యై నమః , కూర్మాయ నమః , అనంతాయ నమః, వరహాయ నమః, పృధివ్యై నమః అని అంటూ పూజ చేయ వలెను. ఆ పై జప సాధన చేయ వలెను.
తెలియనివి తెలుసుకోవటం, తెలుసుకొనిన మంచివాటిని అనుసరించటం అనేవి మనం నిత్యం చేస్తూనే ఉంటాము కాబట్టి ఈ పై విషయాలను కూడా అవగాహన చేసుకొని అనుసరిద్దామా?
జైహింద్.
3 comments:
mamchi suchanalu ichchaaru
jaishriraam
చక్కటి విషయాలను అందించినందుకు కృతజ్ఞతలండి.
కూర్మ యంత్రం వ్రాసిన ఆసన వస్త్రం ఎక్కడ దొరుకుతుంది ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.