గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఆగస్టు 2012, ఆదివారం

ఏవి హరి సేవకు యోగ్యమైన పూజా పుష్పాలు ?

జైశ్రీరామ్.
పుష్పాణి పూజయామి.
శ్లో:-
అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ .
భావము:-
అహింస
ఇంద్రియ నిగ్రహము
సర్వ భూత దయ
ఓర్పు
శాంతి
పరమాత్మకై తపించుట
పరమాత్మ ధ్యానము
సత్యనిరతి
అనే ఎనిమిది విధములైన పుష్పములతో హరిని ఆరాధిస్తే చాలా సంతోషిస్తాఁడు హరి.
జైహింద్.
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

హరి సుమ మాలికాగణ సమర్చనచే గడు ప్రీతి నొందు, సా
దరమున సద్గుణంబులగు దాంతియు, శాంతియు, క్షాంతి మున్నుగా
బరగు పవిత్ర పుష్పముల బాగుగ కూర్చి హరిన్ భజింప స
త్వరము లభించు భక్తులకు వాంఛిత సిద్ధియు సర్వ సౌఖ్యముల్

Pandita Nemani చెప్పారు...

మరొక పద్యము:

నెమ్మది నహింస, యింద్రియ నిగ్రహమ్ము,
దయయు, క్షాంతియు, శాంతియు, తపము, మరియు
ధ్యానమును సత్యమనెడి పుష్పాళి తోడ
నర్చన మొనర్ప సుప్రీతుడగును చక్రి

anrd చెప్పారు...

చక్కటి విషయాలను అందించినందుకు కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.