జైశ్రీరామ్.
గంగా మాతా నమో నమః
స్నాన సమయమున పఠించ వలసిన శ్లోకములుశ్లో:-
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.
క:-
గంగయు యమునయు కృష్ణయు
పొంగే గోదారి వాణి భువి నర్మదయున్
రంగుగ సింధూనదియును
హంగుగ కావేరి జలము లమరుత! నీటన్.
శ్లో:-
గంగా గంగేతి యో బృయాత్ యోజనానాం శతైరపి
ముచ్యతే సర్వ పాపెభ్యో విష్ణులోకం స గచ్చతి.
క:-
గంగా గంగా యనుచును
పొంగుచుపలికేటివారి పుణ్యము పండున్.
తుంగను కలియును పాపము
బంగరు హరి లోకమొదవు భరతావనిలో.
జైహింద్.
1 comments:
స్నాన సమయమున పఠిం చ వలసిన శ్లోకములను వివరించారు. అలాగే " స్నానములు చేయ వలసిన సమయములు , వాటి ఫలితములు మున్నగు నవి కుడా తెలుప గలరు. ఎందుకంటే ఇక్కడ " అర్ధరాత్రి , మిట్ట మధ్యాహ్నం , ఇలా ఎప్పుడంటే అప్పుడు తలమీం ఛి , ఆడా మగా , అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అందుకని వీలు వెంబడి తెలుప గలరు. అభినందనలతో .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.