జైశ్రీరామ్.
సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీ కృష్ణ దేవరాయలు.
ప్రియ సాహియీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2012 న సహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 503 వ పట్టాభిషేక దినోత్సవము.
ఈ కార్యక్రమమును శ్రీ (జోళదరాశి) గుత్తి చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
తేదీ 07 - 08 - 2012 వ తేదీన సాయంత్రం 4 గంటలకు
జరిపించ తలపెట్టినారు.
కార్యక్రమము జరుగు చిఱునామా:-
శ్రీ (జోలదరాశి)గుత్తి చంద్రశేఖర రెడ్డి,
15, మొదటి దశ. (1St Phase)
జయప్రకాశ నారాయణ్ నగర్,
వయా మియాపూర్,
హైదరాబాదు,
500 049.
దూర వాణి. 9177945559.
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
అనేకమంది పెద్దలు వక్తలుగా పలురాష్ట్రాలనుండి వచ్చుచున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
జై హింద్.
4 comments:
ఎంతో మంచి రోజు యీ రోజు తెలుగు
లెంతో సంతసించు యీ రోజు
నీకై ప్రబంధము చెప్పి నిన్ను మెప్పించి నట్టి
శ్రీకృష్ణదేవరాయలు సింహాసన మెక్కిన రోజు
కలయ సాహితీసమరాంగణసార్వభౌముడు
తెలుగుల భాగ్య మనగ కొలువు కెక్కిన రోజు
పొలుపారగా రాయలు భువనవిజయసభను
తెలుగుశారద మెచ్చ కొలువైన మంచి రోజు
ఈ పాటను నా 'శ్యామలీయం' లో ఇప్పుడే ప్రకటించాను.
(syamaliyam.blogspot.in)
ఆంధ్రభాషా యోష కమిత సేవలు చేసి
ఆంధ్రభోజుండను ఖ్యాతి గాంచె
అష్ట దిగ్గజముల కమిత గౌరవమిచ్చి
ప్రోత్సాహమునుగూర్చె పుష్కలముగ
విజయభువన ముఖ్య వివిధ రీతులలోన
జరిపించె సాహితీ సభలు చాల
ఆముక్త మాల్యద యనెడి గ్రంథంబును
స్వయముగ విరచించె సరసగతుల
సాహితీ సమరాంగణ సార్వభౌమ
బిరుదమును గాంచె నారీతి వెలుగులెన్నొ
గూర్చె మున్నాంధ్ర సాహితీ కోమలాంగి
యలర శ్రీకృష్ణదేవ రాయలు బళారె!
తమిళ కన్నడ దేశ ధరణీ తలమ్ముల
తెలుగును వెలయించి దీప్తి కెక్కె
దేశ భాషల యందు తెలుగు లెస్సని పల్కి
భాషాభి మాన ప్రాభవము జూపె
అష్ట దిగ్గజముల నౌదల నెక్కించి
తెలుగు కవితకు పందిరులు బెట్టె
మణిపూస నాముక్త మాల్యద రచియించి
దీటైన కవిరాజ తేజ మొదవె
కలడె శ్రీకృష్ణ దేవ రాయలను బోలు
తెలుగు భాషాభి మాని యీ తెలుగు నేల ?
తెలుగు నేలంగ మరల రా దిగుము భువికి
మంగళారతు లిడుదు తెలుంగు రాయ !
-----సుజన-సృజన
చాలా సంతోషం అండి. పూర్తయినాక సభ విశేషాలు కూడా ఇక్కడ రాయగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.