ప్రియ ఆంధ్రాంమృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
గజముఖుని స్తుతిని గజచిత్ర బంధంలో వ్రాయడంలో కవియొక్క ఉత్కృష్టత మనకు ద్యోతకమౌతోంది.
మీరూ గమనించండి ఈ క్రింది గజ బంధాన్ని.
చూచారు కదా! మీరూ వ్రాసే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఆసక్తితో తప్పక ప్రయత్నించి మీరు సఫలీకృతులవాలని ఆకాంక్షిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
4 comments:
ఆర్యా చాలారోజులకు ఒక మంచి వివరణ నిచారు. దీనర్థం ఇంతకు మ్నుపు పోస్టులు బాగాలేవనా కాదు. ఇంతకు నుందు వ్రాసిన వ్యాసాల్లో వివిధ రకాల బంధపద్యాలను వివరిస్తూ వచ్చారే కానీ ఆ బంధ పద్యాల లక్షణాలను వివరించనందుచేత పెద్దగా నాకు ఉపయోగపడలేదనే చెప్పాలి. అధిక ప్రసంగమైంతే మన్నించమని మనవి.
ప్రియమైన భాస్కరా!
మీకు నచ్చినందుకు సంతోషం.
మిది అధిక ప్రసంగం కాదు. మనోభావాన్ని ఇన్నాళ్ళకు చెప్పారంటే.
ఈ విషయం ఇంతకు ముందే మీరు సూచించి ఉంటే మీ సూచనననుసరించేందుకు యత్నించే వాడిని. మీ మంచి సూచనకు ధన్యవాదాలు.
ఆర్యా! అనుష్టుప్ ను తెలుగు పద్యాలకు వాడవచ్చునా?
ఆర్యా!
అనుష్టుప్ సంస్కృతమున వాడుట కద్దు. డా. గణపతిరావు గారు ప్రయోగించిన ఈ ప్రయోగాలను శ్రీమాన్ బేతవోలు రామ బ్రహ్మం గారు అభినందించినందున మనకు గ్రాహ్యమని గ్రహింప వలసి యున్నది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.