భరత మాత ముద్దు బిడ్డ శ్రీమాన్ అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం చేత జన లోక్ పాల్ బిల్లుసు పెట్టడానికి ఆమోదింప చేసారు.
వారి నుద్దేశించి వ్రాసిన కూపస్థ బంధ ఆట వెలది.
(వృత్తం మీద క్లిక్ చెయ్యండి)
సఖ్య భాగ్య తేజ! సద్యోగ సంధాత!
సన్మనోజ్ఞ భావ! సకల వినుత!
జన్మ ధన్య మగుత సత్యంబు గెలుచుత
వర్ణకలిత భావ భరిత భువిజ!
సాహితీ మిత్రమా! మీరూ ప్రయత్నిస్తే ఇటువంటి పద్యం సునాయాసంగా వ్రాయ గలరు.
జైశ్రీరామ్.
జైహింద్.
1 comments:
మీ బ్లాగుని ఇప్పుడే చూసేను. పద్యాలంటే చాలాఇష్టం.మీరు పండితులు.అందువల్ల మీకవిత్వంనిస్సందేహంగా గొప్పగా ఉంటుంది.మీ బ్లాగులో పేర్కొన్న పంతుల జోగారావు నా తమ్ముడు. అతడి సహకారంతో నేనొక బ్లాగు మొదలు పెట్టాను. పేరు www.apuroopam.blogspot.com ఈ పేరు పెట్టినది కూడా మాతమ్ముడే.దామిలో నేను వ్రాసిన కంద పద్యాలు పెట్టాను.నేను కవినీ కాను పండితుణ్ణీ కాను. ఏవో సరదాగా వ్రాసు కున్న పద్యాలు.తీరిక ఇన్నప్పుడు చదవండి.
కొత్త పాళీ గారు చదివిన దుర్యోధనుడి పద్యంతో చెవుర తృప్పు వదిలింది. ఆయన బ్లాగు కూడా నన్నలరిస్తోంది. ఆయనకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మళ్ళా కలుద్దాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.