ఓ భారతీయ ఆదర్శ యువతీ యువకులారా! మేల్కోండి.
మంచి సమయం ఆసన్నమైంది.
అవినీతి భరతం పట్ట గల జన లోక్ పాల్ బిల్లు కొఱకై అలుపెఱుగని పోరాటం చేస్తున్న అపర గాంధీ మన అన్నా హజారే చేస్తున్న నిజమైన సత్యాగ్రహాన్ని మనసారా అభినందించండి.
మీ నిష్కళంకమైన హృదయ పూర్వకమైన మద్దత్తును తెలియ జేయండి.
నేను సహితం అంటూ ఈ ఉద్యమంలో భాగస్వాములై ముందడుగు వేయండి.
అలుపెఱుగని పోరాటానికి మీరూ శక్తినివ్వండి.
భావి భారత పౌరులలో నీతి బీజాలు నాటే నైతికమార్గదర్శులవండి.
ఎన్నాళ్ళని ఈ దురంతదౌష్ట్యాలను మీలో మీరే తిట్టుకొంటూ, ఏమీ చేయలేని అసహాయులులాగా జీవచ్ఛవాలలాగా జీవించాలని మీరు కోరుకొంటున్నారు?
వద్దు. పిరికితనం మీకు వద్దు.
యావద్భారత దేశంలోను అవినీతి రాబందులు సంఖ్యకంటే
వారి అవినీతి కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధా సర్ప దష్టుల సంఖ్యే ఎక్కువ అన్న మాట మరువకండి.
అంతా ఒక్కటైతే అవినీతిని రూపు మాప గలిగే జన లోక్ పాల్ బిల్లు తేవటం చాలా సులభమన్న విషయం మరువకండి.
అన్నా హజారే అకుంఠిత దీక్షనొక్కమారు మనసారా తిలకించండి.
అకళంక లోక కల్యాణకరమైన హజారే దీక్షకు కారణం అతని ప్రగాఢ ఆత్మ విశ్వాసమే కదా! మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరూ సాఘిక సంస్కరణకుద్యుక్తులయేవారికి తోడ్పడండి.
మీదే విశాల భారతం, మీకే సొంతం, మీదే ఈ విశాల స్వతత్ర్య స్వేచ్ఛా సామ్రాజ్యం, సమైక్యతతో నడప గలిగే మీకే దేశ క్షేమం కూర్చడం సాధ్యమౌతుంది.
విజయోస్తు.
అన్నాహజారే సహృదయతను మీరూ అలవరచుకొన గలిగితే మీరుద్యమించిన నాడు స్వార్థపూరితులకు , వారి రాజకీయ జీవనానికీ నూకలు చెల్లక మానవు.
అన్నా హజారే సత్యాగ్రహ ఫలంగా అన్నా హజారే కోరిన విధంగా జన లోక్ పాల్ బిల్లు అతి త్వరలో నెలకొల్పబడునని మనసారా ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.