గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2011, శనివారం

మూడు పాదాల్లో ఉన్న గూఢ చతుర్థ పాదాన్ని కనుక్కోండి చూద్దాం?

సాహితీ ప్రియులారా!
ఈ క్రింది చంపక మాల వృత్తంలో గూఢ చతుర్థ పాదము అనెడి చిత్ర కవితా విధానము అమరి ఉంది. కవి లోకానికి ఇది సుపరిచితమే. మీరు ఈ మూఢు పాదాలలో గూఢముగా ఉన్న నాలుగవ పాదాన్ని వెలికి తీసి, వ్రాసి. అది అర్థవంతంగా ఉందో , లేదో, తెలియఁ జేయ గలరని ఆశిస్తున్నాను.
చ:-
స్తుత గుఁ గాదె సత్ స్మృతులు? దుర్భరులై విరేలకో?  
త్కతక శరంబొ? భావుకులు క్రాంతిని చూతురు. గూఢతన్ గనున్.
హతవిధి! గూ సచ్ చతుర సార్థ పావనమైన వేదమున్.
? ?    ? ? ? ?     ? ? ? ?      ? ? ?     ? ?      ? ? ?     ? ? ?.
అవకాశం ఉంటే మీరూ ఇటువంటి పద్యాన్ని వ్రాసి పంపండి. పదిమందికీ సాహితీ సౌరభాన్ని పంచుదాం.
http://chramakrishnarao.blogspot.com/2011/02/blog-post.html ద్వారా పద్య విపంచి కూడా చూడగరు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

7 comments:

జ్యోతి చెప్పారు...

స్తుత మగుఁ గాదె సత్ స్మృతులు? దుర్భరులై వినరేలకో? లస
త్కతక శరంబొ? భావుకులు క్రాంతిని చూతురు. గూఢతన్ గనున్.
హతవిధి! గూఢ సచ్ చతుర సార్థక పావనమైన వేదమున్.
స్తుతమతులైన సత్కవులు చూతురు గూఢ చతుర్ధ పాదమునన్

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

సరసపు పద్యమంచు మనసార కవీంద్రులు మెచ్చ నియ్యెడన్
హరి ఫణిభూషణుండజులు హర్షము దెల్ప ప్రసన్న చిత్తమున్
మరి యిదె వ్రాసితిన్ కవికుమారుడ సాధుపదానుచిత్తుడన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రులు ఫణి ప్రసన్న కుమార్ గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.

సరస సుధీర సారసుల జాడవుగా! సుగుణప్రియా! దయా
పర! నగరాననీదుప్రభ ధ్యాసను గన్న పరాకు పోవు, మా
వరరుచి జాడ మీరిదియె భవ్య విరించి జగత్తు.మిత్రుఁడా!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

అద్భుతం, గురువు గారూ! చక్కని పద్యం అందించినందుకు ధన్యవాదాలు. రసజ్ఞులు గమనించాలి. 3,6,9,12,15,18 ఇలా 3వ గుణింతంలో గల అక్షరాలను కలిపి చదివితే ఈ క్రింది వాక్యం వస్తుంది.
సరసుడ సుప్రియానన ప్రసన్న కుమారుడ దివ్య చిత్తుడా

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రసన్న కుమారా! ఆ వాగ్దేవీ కటాక్షం మనందరిపైనా ఉండును గాక. నీకు ధన్యవాదములు.
శుభమస్తు.

ఊకదంపుడు చెప్పారు...

గురువుగారికీ ప్రసన్నకుమార్ గారికీ - సాహో సాహో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్యం చాలా బాగుంది ." నాల్గవ పాదాన్ని పై మూడు పాదాల్లోను ఇమిడ్చి వ్రాయ గలగలగటం సరస్వతీ పుత్రులకె సాధ్యం. చదవ గలగడం నా అదృష్టం.అక్కగా హృదయ పూర్వక అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.