శ్లోll
సత్యాను సారిణీ లక్ష్మీ - కీర్తి: త్యాగానుసారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా - బుద్ధి: కర్మాను సారిణీ.
గీll
లక్ష్మి సత్యానుసారిణి. లక్ష్మి లౌల్య.
కీర్తి త్యాగానుసారిణి. క్షేమకరము.
విద్య లభ్యాస ఫలములు ప్రీతి కరము.
బుద్ధి కర్మానుసారిణి పుడమిపైన.
భావము:-
లక్ష్మి నిత్యం సత్యాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా విద్య పట్టువడుతుంది. మానవ బుద్ధి వారి కర్మను అనుసరించి ఉంటుంది. వాడి కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.
జైశ్రీరామ్.
జైహింద్.