గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2010, సోమవారం

జ్యోతిశ్శాస్త్రజ్ఞులు శ్రీవల్లభవఝల వారు ప్రముఖ బంధకవి కూడాను.


శాll
విశ్వస్తుత్య గుణ ప్రశస్త వరదా! విశ్వేశ్వరా! శ్రీధరా!
విశ్వ శ్రేయ శుభాశ్రితా! భవ హరా! విశ్వంభరా! మాధవా!
పశ్వావశ్య విలోక గోప వరమై భాసిల్లు భాగ్యేశ్వరా!
రాశ్వాసా! విభవా విశేష పరమా! రా సత్యవాచా! వరా!
SREE VISHNU MURTHY PARAMUGAA BHAAVAM
MAADHAVAA! = LAKSHMI DEVI YOKKA BHARTA AINA MAHAA VISHNUVU
PASWAA VASYA VILOKA= PASUVULANU CHOOCHU  VAADUNU, PASUPAALAKUDUNU
GOPAVARAMAI= SRESTAVAINA GOPAALURATHO KUDI UNDU VAADUNU
VISWAMU CHE STUTINCHABADU VAADUNU,GUNA PRAASASTYUDUNU,VISWESWARUDUNU, SREEDHARUDUNU, VISWASREYAMUNU AAKAANKSHINCHU VAADUNU, SUBHAASRITUDUNU BHAVA HARUDUNU, VISWAMBARUDUNU AGU SREE MAHAAVISHNUVU, PASUPAALAKUDAI GOPAALURALO SRESTUDAI PRAKAASINCHU BHAAGYESWARUDU NAA SWAASAMU TAANAI, VISESHA VIBHAVUDAI SATYA VAAKKULATHO  SRESTUDAI  NANU KAAPAADUTAKU RAA, RAAVAYYAA,
SREE, EESWARA PARAMUGAA,
MAADHAVAA=MAAKU PRABHUVAINA EESWARAA!
PASWAAVASYA VILOKA= PASU SWABHAAVAMU GALA VAARINI ( VAARI MUURKHATWAMU THOLAGINCHI) KAAPAADU VAADUNU (THANA VAAHANAMAGU NANDINI SARWADAA CHOOCHU VAADUNU)
GOPA VARAMAI= DAACHA BADINA VARA PRADUDAI
VISWAMUCHE PRAARDIMPABADU SUGUNA SAMPANNUDUNU, VISWESWARUDUNU, VARA PRASAADI U AGU PRABHUVUNU, SAMPADALANU DHARINCHINA VAADUNU, SUBHA PRAMADA GANA PARIVESTITHUNDUNU VISWA SREYAMUNU KORUCHU BHUTHA NAADUDAI, VAARIKI RAKSHANAA KAVACHAMAI OPPU VAADUNU, MAA PRABHUVU ( THANAKEDURUGA UNNA VAAHANAMUNU SARWADAA CHOOCHU CHU, PASU SWABHAAVULA PASUTWAMUNU THOLAGINCHI RAKSHINCHUVAADUNAI) BHAAGYA PRADAAYAKUDANOUCHU OPPEDI EESWARAA! NAA SWAASAVU NEEVU, PARAMAATMUDAVU, VISESHA PRATHIBHA GALAVAADAVU, SATYA VAAKPAALAKAA! EESWARAA! RAA RAMMU.
ప్రియ పాఠకులారా! మీ ఆంధ్రాభిమానాన్ని పద్యకవితాసక్తినీ అభినందిస్తూ; ఆంధ్రామృతం గ్రోలుతున్న మీకు ధన్యవాదాలు తెలియఁ జేసుకొంటున్నాను.
ఇక 
పైన గల చక్ర బంధ శార్దూలాన్ని చూచాం కదా!
ఇంతటి రచనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన మహా కవి యెవరో కాదు. ఒక్క సారి చూస్తే దానిలోని మర్మాన్ని గ్రహించి దానిని అలవోకగా ప్రదర్శించగల కవి పుంగవులు; 
జ్యోతిశ్శాస్త్రపండితులైన విశ్రాంతోపాధ్యాయు శ్రీ వల్లభవఝల నరసింహమూర్తి.
శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావుగారి చక్రబంధాన్ని ఆంధ్రామృతంలో చూడగానే ప్రయత్నించి వ్రాసి; వెన్వెంటనే నాకు వారు పంపిన పద్యమిది.
చూచారా! ఎంతటి సిద్ధ సంకల్పులో.
ఆ వాణి వారి కలాన్ని ఆశ్రయించి; అద్భుత రచనలనందింపఁ జేస్తోంది.
ఎంతటి పుణ్య పురుషులు శ్రీ నరసింహ మూర్తి గారు.
ఆట్టి మహానుభావుని ప్రయత్నం మనం తప్పగ గమనించ గలిగి; దానిని ఆదర్శంగా తీసుకొని; ప్రయత్నించి వ్రాసిన నాడు వారి ప్రయత్నం సాఫల్యం పొందుతుంది.
"పద్య మాల" బ్లాగరు శ్రీ లంక రవీంద్ర కూడా ఇంత చక్కగానూ అనుసరించడమే కాక అద్భుతమైన ప్రయత్న ఫలంగా చక్ర బంధాదులు తన బ్లాగులో వ్రాయడం చూచి నాకు చాలా ఆనందం కలిగింది.
మీరూ ప్రయత్నించి కృతకృత్యులు కాగలందులకు పరమాత్మను ప్రార్థిస్తున్నాను.
జై శ్రీరామ్.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.