గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 14.

పాఠకావతంసులారా! ఈ క్రింది కందంలో అందగించుచున్న భావాన్ని చెప్పుకోండి చూద్దాం.

క:-
శిల వృక్ష లతలఁ బుట్టిన
చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్
తల వాకిట రమియింతురు.
సలలితముగ దీని నెఱుగు సరసులు గలరే?

మీ సమాధానాన్నందించండి ఆసక్తితో గ్రహించేవారికి.

జైహింద్.
Print this post

4 comments:

కంది శంకరయ్య చెప్పారు...

శిలకు పుట్టింది సున్నం. వృక్షానికి పుట్టింది పోకవక్క. లతకు పుట్టింది తమలపాకు. ఈ మూడూ కలిసి తలవాకిట (నోట్లో) రమించడం అంటే తాంబూలసేవనం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

క:-
సుందర భావామృతమును
కందివరులు శంకరయ్య ఘనముగ నిట నా
కందించిరి.ధన్యుడ. కవి
బృందము కని మెచ్చకున్నె? ప్రీతిని యతనిన్.

Vasu చెప్పారు...

అద్భుతంగా ఉంది. శంకరయ్య గారు చెప్పేవరకు నాకర్థం కాలేదు.

అజ్ఞాత చెప్పారు...

Cool!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.