గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, నవంబర్ 2009, శనివారం

చెప్పుకోండి చూద్దాం 20.

సాహితీ ప్రియులారా!
చెప్పుకోండి చూద్దాం 15 కు స్వాగతం. ఈ క్రింది సీసంలోగల ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నంలో కృత కృత్యులవగలరని నా నమ్మకం.
ఇక ఆ సీస పద్యాన్ని చూడండి.

సీ:-
ఏనుగు సింహంబు నెలనాగయును కూడ - ఒక మాట లోపల నుండ వలయు.
పక్షియు వస్త్రంబు పాషాణమునుగూడి - యొక మాట లోపల నుండ వలయు.
ఫణి రాజు ఫణి వైరి ఫణి భూషణుని గూడి - యొక మాట లోపల నుండ వలయు.
రారాజు రతి రాజు రాజ రాజును గూడి - యొక మాట లోపల నుండ వలయు.
గీ:-
దీని యర్థంబు చెప్పుడీ దీప్యముగను - నేర్పు మీరగ మీరలు నెనరు మీర.
చెప్పువారలు పండిత శ్రేష్ఠులు గద. - చెప్పదలచిన వారలు చెప్పుడయ్య.

సమాధానం పంపగలరు కదూ?

జైహింద్.
Print this post

2 comments:

mmkodihalli చెప్పారు...

నాగకేసరాలు,కాకిబొంతరాయి,నాగగరుడేశ్వరము,రాజమదనకుబేరము

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చక్కగ వివరించితిరయ
నిక్కముగా మీరు మీదు నేర్పుకనబడన్.
చక్కని పాండితినెన్నుచు
పుక్కిటనిడు కోడిహళ్ళి మురళీ మోహన్!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.