గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జూన్ 2009, మంగళవారం

సాహితీ మిత్రులారా! నేనిప్పుడు సౌ భాగ్య నగర వాసిని.

శ్రీమదాంధ్రామృత పాననాసక్త చిత్తులారా! సుమనర్నమస్సులు. కొంత కాలంగా అంతర్జాలం అందుబాటులో నాకు లేక పోయిన కారణంగా నేను మీ అందరికీ దూరమవ వలసి వచ్చింది. మన్నింప మనవి. నేను ప్రస్తుతం చోడవర గ్రామము నుండి సకుటుంబంగా మన సౌభాగ్య నగరానికి మకాం మార్చానని తెలియఁజేయుటకు ఆనందంగా వుంది. ఆనంద కారణ మేమిటంతారా! మన బ్లాగ్మిత్రుల కాలవాలమై భాగ్య నగరం సౌభాగ్య నగర మైందని నేను భావిస్తున్నాను. అట్టి సౌభాగ్య నగరాన మీ అందరికీ అత్యంత సమీపంగా నే నుండ గలగడమే నా ఆనంద కారణం. మీ అందరి నుండి అనేకసాహిత్యాంశములు బ్లాగుల ద్వారానే కాక ముఖాముఖీగా కూడా తెలుసుకొనే సదవకాశం నాకు లభించి నట్లుగా భావిస్తున్నాను. మీ అందరి సహకారం తప్పక నేను పొందగలనని నేను భావిస్తున్నాను. నా సెల్ నెమ్బరు 9247272960.

జైహింద్.

Print this post

17 comments:

కాలనేమి చెప్పారు...

స్వాగతం!! హైదరబాదుకు :)

అజ్ఞాత చెప్పారు...

ఎమిటి మాసస్టారూ, మా మీద , రాకేస్ మీదా కోపం వచ్చిందా? అంతదూరం వెళ్ళిపోయారు?

కంది శంకరయ్య చెప్పారు...

చింతా వారూ, చాలా సంతోషం. ఇకనుండి క్రమంతప్పకుండా పూరణల కోసం సమస్యలు ఇస్తారని ఆశిస్తున్నాను.

శరత్ కాలమ్ చెప్పారు...

సంతోషం. నేను ఇండియాకు వచ్చినప్పుడు కలుసుకోవాలనుకునే వ్యక్తుల్లో మీరు ఒకరు. మీరు హైదరాబాదుకి దగ్గర్లో వుంటుండటంతో మిమ్మల్ని కలుసుకోవడం సులువు అవుతుంది.

జ్యోతి చెప్పారు...

సుస్వాగతం....

Sujata M చెప్పారు...

ట్రాఫికాబాదు కు స్వాగతం.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

స్వాగతం మాస్టారు గారు.

మరువం ఉష చెప్పారు...

క్రొత్త ప్రదేశంలో మీ అధ్యాత్మిక రచనావ్యాసాంగం నిరాటంకంగా మరింత అమృతం పంచాలని ఆకాంక్ష.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఉ:-
యోగిశుభాకృతిన్ బలికె యోగ్యముగా శుభస్వాగతమ్ము.నా
యోగము పండె నిక్కమయ.యోగ్యతగల్గెనుయోగిపుంగవున్
వేగమె కల్వగా,సుగుణ పేశల సద్గుణు తోడ బల్కగా.
యోగ్యుడవైన నీకు శుభ యోగము గూర్చెడు దైవ మెల్లెడన్.
శా:-
సద్యోగాకృతి యోగి వర్య! మములన్ సఖ్యత్వ సద్భావనన్
వేద్యంబౌనటు స్వాగతించితిరి.ప్రత్యేకించి మీ బోంట్లతో
విద్యామూర్తులతో వసించు సుఖముల్ ప్రీతిన్ కనన్ గల్గు. నా
ఉద్యోగంబు శుభంబు గొలపుటొకటే ఉత్తేజమున్ గొల్పుచున్.
ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Dear Harephala!
ఉ:-
కోపముపొందనేమిటికి? కోరిక తీరగ పల్కరింతు రే
పాపము చేయనేర్వరు.శుభంబునె కోరుదురీరు.మీప్పయిన్
కోపముచెంది పాపమును కూర్చుకొనంగను వెఱ్ఱివాడినా?
నా పనులిచ్చటుండి,విడినాడను చోడవరంబు మిత్రమా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నమస్తే.
క:-
కంది శంకరయ్య కరుణార్ద్ర హృదయము
పలుకరించి మేలు కొలిపె కవిని.
పూరణకు సమస్య తీరిక గలిగిన
యప్పుడిత్తు. నిజము. అరయుడయ్య.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సహోదరీ! దివ్యజ్యోతీ! ధన్యోస్మి.
దివ్యజ్యోతియె స్వాగతించె. నికపై దేదీప్యమానంబు నా
భవ్యంబైన మహత్వ జీవనము. సద్ భావంబు మీనుండినే
నవ్యంబౌనటు సంగ్రహించి రచనన్ నామార్గమున్ జూపి,యా
దివ్యుల్, సత్కవివర్యులెంచి పొగడన్ దీప్యంబుగా జేసెదన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుహృద్భావ సుజాత సహోదరీ!
ట్రాఫిక్ బాదగునమ్మ!నిక్కమిది.మాటల్ పెక్కు పద్యమ్ములై
ట్రాఫిక్ జామయినట్లు బ్లాగులమరున్రాపాడు భావంబులన్.
సాఫీగా సుఖజీవనమ్ము లొసగున్ సన్మార్గమున్ జూపి.సత్
సాఫల్యంబగు జీవితమ్ము గనినన్, సద్భావనా లోలతన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జిగురు సత్యనార్య! శ్రీకరంబైనట్టి
మీరు స్వాగతించు మేలి మాట
భవ్య భావ ములకు నవ్య మార్గము కదా!
ధన్య వాదములయ! దార్శనికుడ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీశరత్! చంద్రికల్గొల్పు శ్రేయములును,
కాల(మ్.+ఒ)మొసగెడి సద్భావ జాలములును.
ధర శరత్ కాల మైనట్లు మురిసె మనసు.
మీదు రాకను కాంక్షించు.మిత్ర వర్య!

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

ఎంత శుభ వార్త ! మిత్రమా ! " చింత రామ
కృష్ణ రాయ ! " స్వాగతము ! మీ రిటకు రాగ,
పద్య కవివర్గ బలమింక బహుళమగును _
భాగ్య నగరమ్ము పాలి సౌభాగ్య మనగ !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

డా. ఆచార్య ఫణీంద్రా!
ఉ:-
స్వాగత మీరు పల్కితిరి. సద్గుణవందిత మా ఫణీంద్రుడా!
రాగల కాలమెల్ల కవిరాజ విరాజిత కావ్య కన్యకల్
రాగలరయ్య.నిక్కమిది.రాజిలు సత్కవిరాజులెల్లరున్.
యోగముగొల్పెదీరిక సయోగముగొల్పుచు.
వందనమ్మయా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.